Minister Abdul Sattar: రైతు ఆత్మహత్యలు కొత్తేమీ కాదు.. ‘మహా’మంత్రి సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Farmers Suicide Not New Says Maharashtra Agriculture Minister Abdul Sattar: రైతు ఆత్మహత్యలు కొత్తేమీ కాదని, కొన్నేళ్లుగా ఈ ఘటనలు జరుగుతున్నాయని మహారాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అబ్దుల్ సత్తార్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఔరంగాబాద్ జిల్లాలోని సిలోద్ నియోజకవర్గంలో.. రైతు ఆత్మహత్యలకు మీడియా ప్రశ్నించినప్పుడు, ఈమేరకు మంత్రి సమాధానం ఇచ్చారు. ‘‘రైతు ఆత్మహత్యల సమస్య అనేది కొత్తేమీ కాదు. చాలా సంవత్సరాల నుంచి ఈ సంఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. అయితే.. నా నియోజకవర్గంతో పాటు మొత్తం మహారాష్ట్రలో ఎక్కడా రైతుల ఆత్మహత్యలు జరగకూడదని నేను కోరుకుంటున్నాను’’ అంటూ ఆయన చెప్పుకొచ్చారు.
Lufthansa Turbulence: విమానంలో కుదుపులు.. 37 వేల నుంచి 4 వేల అడుగులకి ఢమాల్
Also Read
- Meerut Blue Drum Murder: మీరట్ ‘‘బ్లూ డ్రమ్ మర్డర్’’.. మరణశిక్ష విధిస్తూ ‘‘భగవద్గీత’’ను ప్రస్తావించిన న్యాయమూర్తి.!
- CJP: ‘‘సంతకాలు చేసి ఉల్లంఘించారు’’.. కాక్రోచ్ నేతలను జైలుకు పంపడానికి కారణాలివే.!
- Real Estate Boom: రియల్ ఎస్టేట్కు జోష్.. ఇళ్ల ధరల్లో 12 శాతం పెరుగుదల.. కొనుగోలుదారుల చూపు అటువైపే
- CJP: ‘‘దేశాన్ని నాశనం చేస్తున్నారు’’.. అభిజిత్ దీప్కేకు ఢిల్లీ ఎయిర్పోర్టులో అవమానం..
ఇదిలావుండగా.. స్థానిక పోలీసుల వివరాల ప్రకారం మార్చి 3 నుంచి 12వ తేదీ మధ్య సిలోద్‌లో ఇద్దరు రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఔరంగాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే.. మొత్తం ఆరుగురు రైతులు అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్టు స్థానిక కథనాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలోనే రైతు ఆత్మహత్యలపై మీడియా వాళ్లు ప్రశ్నించగా.. ఆయన పై విధంగా స్పందించారు. అంతేకాదు.. రైతు ఆత్మహత్యల పరిష్కారం కోసం వ్యవసాయ శాఖ కమిషనర్ ఆధ్వర్యంలో ఓ కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. గత వారంలో భారీ వర్షాలు పడటంతో తీవ్ర పంట నష్టం వాటిల్లగా.. దాన్ని పరిశీలించేందుకు మంత్రి ఆదివారం పర్యటించారు. కమిటీ నివేదిక సమర్పించిన అనంతరం.. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు.
LPG Gas Cylinder: ప్రజలకు సర్కార్ బంపరాఫర్.. గ్యాస్ ధరపై రూ.300 తగ్గింపు
‘‘రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టింది. వారికి కేవలం ఒక్క రూపాయికే పంటల బీమా ఇస్తున్నాం’’ అంటూ మంత్రి సత్తార్ పేర్కొన్నారు. మరోవైపు.. మార్చి 9న ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్‌లో ఏక్‌నాథ్ షిండే-బీజేపీ ప్రభుత్వం రైతులకు రూ. 6,000 సహాయంతో పాటు రూ. 1 పంట బీమా పథకాన్ని ప్రతిపాదించింది. అటు.. గత రెండు నెలలుగా పంట ధరలు పడిపోతుండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్న ఉల్లి రైతులకు, పెద్ద ఉపశమనంగా సీఎం ఏక్‌నాథ్ షిండే సోమవారం క్వింటాల్‌కు రూ. 300 ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు. అయితే.. ప్రతిపక్షాలు మాత్రం రూ.500 నుంచి రూ.700 వరకు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
IDBI Bank Stake Sale: IDBI బ్యాంక్లో భారీ మార్పు! 60.72% వాటాల విక్రయం.. డీల్ విలువ రూ.52,878 కోట్లు
-
Tirumala Laddu Ghee Case: కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం.. భారీగా ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
-
Congress Councillors: కాంగ్రెస్కు ఏడుగురు కౌన్సిలర్ల రాజీనామా.. !
-
Meerut Blue Drum Murder: మీరట్ ‘‘బ్లూ డ్రమ్ మర్డర్’’.. మరణశిక్ష విధిస్తూ ‘‘భగవద్గీత’’ను ప్రస్తావించిన న్యాయమూర్తి.!
-
Tecno Spark 50s 5G: టెక్నో Spark 50s 5G లాంచ్ డేట్ ఫిక్స్.. iPhone 18 Pro తరహా Burgundy Red కలర్లో కొత్త ఫోన్!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..