Vivek Ramaswamy: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరుపున అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న ఇండో-అమెరికన్ వివేక్ రామస్వామి హిందూమతం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. అయోవాలో శనివారం ది ఫ్యామిలీ లీడర్ అనే సంస్థ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రామస్వామి తన భార్య అపూర్వ న్యూయార్క్ లోని మెడికల్ రెసిడెన్సీలో ఉన్నప్పుడు, ఆమెకు గర్భస్రావం జరిగిందని, మొదటి బిడ్డను కోల్పోయామని, రెండోసారి కూడా గర్భస్రావం జరుగుతుందేమో అనే భయాన్ని ఎదుర్కొన్నట్లు తెలిపారు.
Read Also: Producer SKN: కూతురి పెళ్లికని దాచిన డబ్బును కొట్టేసిన చెదలు.. ‘బేబీ’ సినిమా నిర్మాత కీలక ప్రకటన
హిందూ విశ్వాసమనే తనను అధ్యక్ష ఎన్నికల వైపు నడిపించిందని వివేక్ రామస్వామి వెల్లడించారు. ‘‘నా విశ్వాసమనే నాకు స్వేచ్ఛనిచ్చింది. నా విశ్వాసమే నన్ను అధ్యక్ష ఎన్నికల వైపు నడిపించింది. నేను హిందువును. నిజమైన దేవుడు ఒక్కడే అని నమ్ముతాను. దేవుడు మనలో ప్రతీ ఒక్కర్ని ఒక ప్రయోజనం కోసం ఇక్కడ ఉంచాడని నమ్ముతాను. హిందూ విశ్వాసం మనకు కర్తవ్యం, నైతిక బాధ్యతను బోధిస్తుంది. మన ద్వారా దేవుడు వివిధ మార్గాల్లో పనిచేస్తుంటారు. దేవుడు మనందరిలో ఉన్నందును మనం ఎప్పటికీ సమానమే, అదే నా విశ్వాసం’’ అంటూ హిందూ ధర్మం గురించి చెప్పారు.
అమెరికా అధ్యక్షుడినైతే నేను మతాన్ని ప్రచారం చేయలేను, అది అధ్యక్షుడి బాధ్యత కాదని అన్నారు. కానీ ఆయా మాతాలు నేర్పిన విలువలకు కట్టుబడి ఉంటానని, వాటిని తర్వాత తరాలకు తెలియజేస్తానని అన్నారు. ప్రస్తుతం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరుపున అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం డినాల్డ్ ట్రంప్, వివేక్ రామస్వామి, నిక్కీ హేలీ వంటి వారు పోటీ పడుతున్నారు. వీరిలో ట్రంప్, ఫ్లోరిడా గవర్నర్ రోన్ డీశాంటిస్ ముందంజలో ఉన్నారు. వివేక్ రామస్వామి మూడోస్థానంలో ఉన్నారు. వచ్చే ఏడాది నవంబర్ 24న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.