Producer SKN to Help a Man in AP: ఆంధ్ర ప్రదేశ్ పార్వతీపురం మన్యం జిల్లాలో ఓ తండ్రి కూతురి పెళ్లి కోసం దాచుకున్న డబ్బు చెదల పాలు కావడంతో ఏమి చేయాలో తెలియని స్థితిలోకి వెళ్ళిపోయాడు. అసలు విషయం ఏంటంటే పార్వతీపురం మన్యం జిల్లాలో తన కూతురి పెళ్లి కోసం కష్టపడి వచ్చిన డబ్బును తన ఇంట్లో ఒక పెట్టెలో దాచి ఉంచాడు ఒక వ్యక్త. సుమారు రూ. 2 లక్షల మొత్తాన్ని తన ఇంట్లో భద్రపరిచాడు అయితే ఆ డబ్బుకి చెదలు పట్టిందా..? లేక ఇంట్లో తిరుగాడే ఎలుకలు కొరికాయో తెలియదు కానీ ఇలా ఆ మొత్తం డబ్బు వినియోగించుకునేందుకు పనికిరాకుండా ముక్కలుముక్కలు అయింది డబ్బును చూసిన ఆ తండ్రి కంట కన్నీళ్లు ఆగక కన్నీరు పెట్టుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Raviteja : తనని స్టార్ హీరోని చేసిన ఆ సినిమా కు రవితేజ మొదటి ఛాయిస్ కాదా ..?
సోషల్ మీడియా ద్వారా ఆ తండ్రి కన్నీళ్లు చూసిన బేబీ సినిమా నిర్మాత ఎస్‌కేఎన్ తన మంచి మనసు చాటుకున్నాడు. ఆ కుటుంబానికి సాయం చేసేందుకు ఆయన ముందుకు వచ్చి ఆ తండ్రి వివరాలు తనకు పంపాలని… ఆయన కుమార్తె పెళ్లికి అవసరమయ్యే డబ్బు విషయంలో సాయం చేయాలని తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించాడు. ఇక ముందు మెగా ఫ్యామిలీ ఫ్యాన్ గా ఉన్న ఎస్కేఎన్ ఆ తరువాత అల్లు అర్జున్ కి బాగా క్లోజ్ అయ్యాడు. ఇక తరువాత కొన్నాళ్ళు పీఆర్వోగా పని చేసి నిర్మాతగా మారాడు. గతంలో విజయ్ దేవరకొండ హీరోగా టాక్సీవాలా సినిమా నిర్మించిన ఆయన తర్వాత ఆనంద్ దేవరకొండ హీరోగా బేబీ నిర్మించి హిట్ అందుకున్నాడు.