India-US: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై విధించిన 50 శాతం సుంకాలను ఆర్థిక, రాజకీయ విశ్లేషకులు తప్పుపడుతున్నారు. ఇది రెండు దేశాల మధ్య సంబంధాలను తీవ్రంగా దెబ్బతీస్తోందని హెచ్చరిస్తున్నారు. ప్రముఖ అమెరికన్ అంతర్జాతీయ సంబంధాల నిపుణుడు, చికాగో విశ్వవిద్యాలయంలో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ అయిన జాన్ మెయర్‌షీమర్, ట్రంప్ వైఖరిని తప్పుపట్టారు. ట్రంప్ పరిపాలన భారత విధానాన్ని ‘‘భారీ తప్పు’’గా అభివర్ణించారు. రష్యన్ చమురును కొనుగోలు చేస్తున్న భారత్‌పై సెకండరీ టారిఫ్స్ పనిచేయవని అన్నారు.
US: డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై విధించిన 50 శాతం సుంకాలు భారత్, రష్యాను మరింత దగ్గర చేయడమే కాకుండా, చైనాతో భారత స్నేహాన్ని ముందుకు తీసుకెళ్లాలా చేసింది. చైనాలోని టియాంజిన్‌లో జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) శిఖరాగ్ర సమావేశంలో మోడీతో పుతిన్, జిన్‌పింగ్‌లు భేటీ అయ్యారు. అయితే, ఈ పరిణామాలు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌కి ఎక్కడా లేని కోపాన్ని తెప్పిస్తున్నట్లు తెలుస్తోంది.
భారతదేశంపై అమెరికా వాణిజ్య సలహాదారు పీటర్ నవారో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య వివాదం పరిష్కారం కాకుండా భారతదేశం ఆజ్యం పోస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు.