కరోనా మహమ్మారి తన రూపును మార్చుకుంటూ మానవ శరీరభాగాలపై దాడులు చేస్తున్నది. ఈ మహమ్మారి కారణంగా ఇప్పటికే దాదాపుగా 30 లక్షలకు పైగా మరణాలు సంభవించాయి. అమెరికాలోనే అత్యధికంగా మరణాలు నమోదయ్యాయి. అమెరికాలో అత్యంత వేగంగా వ్యాక్సిన్లు అందిస్తున్నారు. అయినప్పటికీ ఇంకా తీవ్రత ఏ మాత్రం తగ్గలేదు. అమెరికా 245 వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన కీలక వ్యాఖ్యలు చేశారు.
Read: స్పెషల్ మేకః నాజ్ వెజ్‌ను ఇలా లాగించేస్తోంది….
కరోనా మహమ్మారి తీవ్రత నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదని, ప్రస్తుతానికి పైచేయి మాత్రమే సాధించామని జోబైడెన్ పేర్కొన్నారు. భవిష్యత్తులో తప్పని సరిగా కోవిడ్‌పై విజయం సాధిస్తామనే ధీమాను వ్యక్తం చేశారు. ఏడాది కాలంగా చీకట్లో మగ్గుతున్నామని, త్వరలోనే మంచిరోజులు వస్తాయని ఆయన తెలిపారు. ప్రస్తుతం డెల్టా వేరియంట్లు ప్రపంచాన్ని భయపెడుతున్నాయని, జాగ్రత్తగా ఉండాల్సిన తరుణం అని జో బైడెన్ పేర్కొన్నారు.