అమెరికాలో దారుణం జరిగింది. ఇమ్మిగ్రేషన్ ఏజెంట్లు మారణహోమం సృష్టించారు. వలసదారులపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది.
ఇది కూడా చదవండి: Chiranjeevi : వీళ్ళందరూ సుభిక్షంగా ఉన్నప్పుడే నిజమైన సంక్రాంతి!
ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. వలసదారులను పట్టుకుని స్వదేశాలకు పంపేస్తున్నారు. తాజాగా బుధవారం మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లో ఇమ్మిగ్రేషన్ ఆపరేషన్ నిర్వహించింది. ఇంకోవైపు ఇమ్మిగ్రేషన్ ఆపరేషన్‌కు వ్యతిరేకంగా నిరసనకారులు ఆందోళనలు నిర్వహించారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో ఫెడరల్ ఏజెంట్లు రంగంలోకి దిగి చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇమ్మిగ్రేషన్ ఏజెంట్.. కారులో కూర్చున్న మహిళపై కాల్పులకు పాల్పడ్డాడు. అక్కడికక్కడే రెనీ గుడ్ (37) అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. మహిళ మృతి తర్వాత పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా మారాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.

ఇమ్మిగ్రేషన్ నిరసనలతో రెనీ గుడ్‌కు ఎలాంటి సంబంధం లేదని బాధితురాలి తల్లి తెలిపింది. రెనీ గుడ్‌కు ముగ్గురు పిల్లలు ఉన్నారని తెలిపింది. అన్యాయంగా కాల్చి చంపారని వాపోయింది. ఇక డెమోక్రటిక్ సెనేర్ టీనా స్మిత్ మాట్లాడుతూ.. బాధితురాలు అమెరికా పౌరురాలని.. ఆమెకు ఇమ్మిగ్రేషన్ ఆపరేషన్ లక్ష్యం కాదని తెలిపారు.

ట్రంప్ పరిపాలనపై మిన్నెసోటా గవర్నర్ టిమ్ వాల్జ్ తీవ్రంగా మండిపడ్డారు. ఇది భయానక సంఘటనగా పేర్కొ్నారు. తమకు సమాఖ్య ప్రభుత్వం నుంచి ఎటువంట సహాయం అవసరం లేదని.. రాష్ట్రాన్ని రక్షించడానికి నేషనల్ గార్డ్స్‌ను అప్రమత్తంగా ఉంచినట్లు తెలిపారు. ఇక ఈ ఘటనను న్యూయార్క్ మేయర్ మమ్దానీ కూడా తప్పుపట్టారు. డెమోక్రటిక్ పాలనలో ఉన్న నగరాలపై ఉద్దేశ పూర్వకంగా ఇమ్మిగ్రేషన్ ఏజెంట్లు దాడులు చేస్తున్నారని ఆరోపించారు. మిన్నెసోటాలో జరిగింది కచ్చితంగా హత్యేనని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Off The Record: విష్ణు విషయంలోనే టీజీ అసహనంగా ఉన్నారా..?