Donald Trump: వైట్ హౌజ్లో సమీపంలో ఇద్దరు నేషనల్ గార్డ్ సెక్యూరిటీ సిబ్బందిపై ఆఫ్ఘాన్ జాతీయుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అన్ని ‘‘మూడో ప్రపంచ దేశాల’’ నుంచి అమెరికాలోకి వలసల్ని శాశ్వతంగా నిలిపివేస్తామని ప్రకటించారు. దీని వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కొలుకుంటుందని చెప్పారు. ట్రంప్ నిర్ణయం ప్రపంచ వ్యాప్తంగా భారీ ప్రభావాన్ని చూపిస్తుంది. మెరుగైన జీవితం, విద్య,…
H-1B Visa: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసలు, ఇమ్మిగ్రేషన్ విధానాలపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. దీంతో పాటు H-1B వీసా విధానంపై అనేక కొత్త నిబంధనలు తీసుకువస్తున్నాడు. H-1B వీసాల ద్వారా విదేశీయులు, అమెరికన్ల ఉద్యోగాలను కొల్లగొడుతున్నారని అధికార రిపబ్లికన్ పార్టీ సభ్యులు ఆరోపిస్తున్నారు.
H-1B Visa: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న H-1B వీసా చర్యలు భారతీయుల్లో కల్లోలం నింపుతున్నాయి. చాలా ఏళ్ల తర్వాత తమ తల్లిదండ్రుల్ని, కుటుంబాలను కలవడానికి వచ్చిన వారు, పెళ్లి చేసుకునేందుకు వచ్చిన వారు అయోమయ స్థిలో పడ్డారు. తమ వివాహాలను రద్దు చేసుకుని, మళ్లీ అమెరికా ఫ్లైట్ ఎక్కుతున్నారు. హెచ్1బీ వీసాల రుసుము 1,00,000 డాలర్లు(రూ. 88 లక్షలు)కు పెంచుతూ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం పెట్టాడు.
H-1B visa: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H-1B వీసాదారులకు షాక్ ఇచ్చారు. H-1B వీసాల రుసుమును $100,000 (రూ. 88 లక్షలు)కి పెంచాలని US అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆకస్మికంగా తీసుకున్న నిర్ణయం భారతీయ టెక్కీలో ఆందోళన పెంచాయి.
US Bans Sports Visas: అమెరికా అధ్యక్షుడు తనదైన మార్క్ పాలనను కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా అమెరికాలో ట్రాన్స్జెండర్ మహిళలకు ఎదురుదెబ్బ తగిలింది. మహిళల క్రీడలలో పాల్గొనడానికి వీసా కోసం దరఖాస్తు చేసే ట్రాన్స్జెండర్ అథ్లెట్లకు ఇక నుంచి ఆమోదించారు. అమెరికన్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) తాజా పాలసీ ప్రకారం, పురుషుడిగా జన్మించి లింగమార్పిడి చేసి మహిళల క్రీడల్లో పోటీ పడే క్రీడాకారుల దరఖాస్తులను ప్రతికూలంగా పరిగణించనున్నట్టు సోమవారం ప్రకటన విడుదల చేసింది. Rekha…
ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపారు. దొరికిన వారిని దొరికినట్టే కారాగారంలో వేస్తున్నారు. ఇక పాలస్తీనా పౌరులైతే మరి కఠినమైన చర్యలకు దిగుతోంది. ప్రస్తుతం అమెరికాలో చాలా కఠినమైన నిర్ణయాలు అమలవుతున్నాయి.
అమెరికా ప్రభుత్వం ఇటీవల విదేశీ విద్యార్థులపై చర్య తీసుకుంది. స్టూడెంట్ వీసా హోల్డర్లను గుర్తించి, పరిశీలించడానికి “క్యాచ్ అండ్ రివోవల్” కార్యక్రమాన్ని విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ప్రకటించారు. ఇందులో యూదు వ్యతిరేకత లేదా పాలస్తీనియన్లు, హమాస్కు మద్దతు ఇచ్చే ఆధారాల కోసం వారి సోషల్ మీడియాను పర్యవేక్షించడం కూడా ఉంది. ఈ చర్య తర్వాత, చాలా మంది అంతర్జాతీయ విద్యార్థుల వీసాలు రద్దయ్యాయి. వారిలో ఎక్కువ మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు. అమెరికన్ లాయర్స్ అసోసియేషన్…
USA: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత అక్రమ వలసదారులు, ఇమ్మిగ్రేషన్లపై విరుచుపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే సరైన డాక్యుమెంట్లు లేని వలసదారులను దేశం నుంచి బహిష్కరించాడు. ఇదిలా ఉంటే, వలసదారుల అణిచివేతలో భాగంగా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ మరో చర్యను తీసుకుంది.
Donald Trump: డాక్యుమెంట్లు లేకుండా అమెరికాలో ఉంటున్న భారతీయులను తీసుకునేందుకు మన దేశం అంగీకరించింది. అమెరికాలోకి అక్రమంగా వచ్చిన భారతీయ వలసదారుల విషయంలో ప్రధాని నరేంద్రమోడీ ‘‘సరైనది చేస్తారు’’ అని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ప్రధాని మోడీ, ట్రంప్ సోమవారం ఫోన్లో మాట్లాడిన తర్వాత ట్రంప్ నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి. ఇరువురు నేతలు రెండు దేశాల మధ్య స్నేహ సంబంధాలు, ద్వైపాక్షిక సంబంధాల గురించి, ప్రపంచ రాజకీయ పరిస్థితుల గురించి చర్చించారు.