మెగాస్టార్ చిరంజీవి గారు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. “అందరికీ హృదయపూర్వక నమస్కారం. అలాగే మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక్కడ నా మిత్రుడు, సోదర సమానుడు, అత్యంత ఆప్తుడు వెంకీ.. ఆయనతో చేయటం అన్నది నాకు చాలా ఎక్సైటింగ్‌గా ఉంది, దాని గురించి తర్వాత మాట్లాడతాను. ‘మనదే కదా సంక్రాంతి, ఎరగతీద్దాం సంక్రాంతి’ అనేది కేవలం ‘మన శంకర వరప్రసాద్ గారిదే’ కాదు, ఈ సంక్రాంతి మొత్తం మన తెలుగు పరిశ్రమది అవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అందరికీ డార్లింగ్, ఇందాక మన అనిల్ చెప్పినా.. ఎవరు చెప్పినా.. ప్రభాస్ ‘రాజా సాబ్’ కానీ, ‘అన్నయ్య’ అంటూ ఆప్యాయంగా పిలిచే నా తమ్ముడు రవితేజ సినిమా కానీ, అలాగే మా ఇంట్లో సరదాగా తిరుగుతూ చిన్నప్పటి నుంచి పెరిగినటువంటి శర్వానంద్ ‘నారే నారే నడుమ మురారి’ కానీ, నాకు గురువుగా నన్ను భావిస్తూ.. ఒక నా శిష్యుడిగా ఉన్న నవీన్ పోలిశెట్టి.. వీళ్ళందరి సినిమాలు కూడాను ఈ సంక్రాంతికి సూపర్ హిట్ అవ్వాలని, తద్వారా వాళ్ళకి విజయం లభించడమే కాదు.. తెలుగు సినిమా పరిశ్రమకు, నిర్మాతలకు, బయ్యర్లకి.. వీళ్ళందరూ కూడా సుభిక్షంగా ఉన్నప్పుడే అదే నిజమైన సంక్రాంతి.
Also Read :Chiranjeevi : ఇదే రకంగా ఉండండి.. ఇదే కష్టాన్ని నమ్ముకోండి
ఆ సంక్రాంతి కావాలనే కోరుకుంటున్నాం, జరుగుతుందని ఆశభావన వ్యక్తం చేస్తున్నాను. అది మీరు ఇచ్చి తీరుతారన్నటువంటి ప్రగాఢ నమ్మకం అయితే నాకు ఉన్నది. ఈ 2026 సంక్రాంతి తెలుగు పరిశ్రమ మర్చిపోకూడదు. అలాంటి సంక్రాంతి మీరు మాకు ఇవ్వాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతి సినిమా కామెడీ జోనర్, ఫ్యామిలీ జోనర్ తోటి, ఎంటర్టైన్మెంట్ జోనర్ తోటి.. పర్ఫెక్ట్ సంక్రాంతికి వచ్చే సినిమాలు ఇవన్నీ, సంక్రాంతికి నచ్చే సినిమాలు ఇవన్నీ. కాబట్టి ఈ సంక్రాంతి అన్ని సినిమాలు బాగా ఆడతాయి అనుకుంటున్నాను. ఆడేలా చేసే బాధ్యత మీది. దయచేసి అన్ని సినిమాల్ని థియేటర్ కి వెళ్లే చూడండి, థియేటర్ లోనే ఆశీర్వదించండి. అలాగే నన్ను ఆశీర్వదించండి.” అని అన్నారు.