Meher Ramesh : నటుడుగా రీ – ఎంట్రీ ఇస్తున్న డైరెక్టర్ మెహర్ రమేష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ సీనియర్ దర్శకుడు మెహర్ రమేష్ త్వరలోనే వెండితెరపై నటుడిగా కనిపించబోతున్నారు. గతంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘బాబీ’ సినిమాలో ఒక కీలక పాత్ర పోషించి నటుడిగా మెప్పించిన మెహర్ రమేష్, ఆ తర్వాత మెగాఫోన్ పట్టి దర్శకుడిగా మారారు. ప్రభాస్ హీరోగా బిల్లా, ఎన్టీఆర్ హీరోగా కంత్రి, శక్తి, వెంకీతో షాడో, చిరుతో భోళా శంకర్ వంటి భారీ చిత్రాలను తెరకెక్కించారు మెహర్. కానీ బిల్లా మినహా మిగిలిన సినిమాలన్నీ ప్లాప్స్ కావడంతో డైరెక్టర్ గా కాస్త గ్యాప్ వచ్చింది.
దాంతో ఇప్పడు యాక్టింగ్ వైపు మళ్లాడు మెహర్ రమేష్. చాలా కాలం తర్వాత మళ్లీ మేకప్ వేసుకోనుండటం ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది. దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మెహర్ రమేష్, రాబోయే ఒక క్రేజీ ప్రాజెక్ట్‌లో నటుడిగా రీ-ఎంట్రీ ఇస్తున్నారు. కథ డిమాండ్ మేరకు ఒక విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ‘బాబీ’ సినిమా తర్వాత మళ్లీ వెండితెరపై పూర్తిస్థాయి పాత్రలో కనిపించకపోవడంతో, ఈ రీ-ఎంట్రీ ఎలా ఉండబోతుందనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. సాధారణంగా దర్శకులు నటులుగా మారి మెప్పించడం టాలీవుడ్లో కొత్తేమీ కాదు. గతంలో విశ్వనాథ్, దాసరి నారాయణరావు వంటి దిగ్గజాల నుంచి నేటి తరం దర్శకుల వరకు చాలా మంది నటులుగా మారి సక్సెస్ అయ్యారు. ఇప్పుడు అదే బాటలో మెహర్ రమేష్ కూడా తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయబోతున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు, సినిమా పేరు మరియు ఆయన పాత్ర గురించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది.
Also Read
- Sandeep Reddy Vanga: వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఈ పేర్లు పెట్టండి.. సీఎం రేవంత్‌కు సందీప్ రెడ్డి వంగా స్పెషల్ రిక్వెస్ట్!
- Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
- The Paradise: నైజాంలో 'ది ప్యారడైజ్' టికెట్ హైక్స్ దాదాపు ఫిక్స్ ? ఇక జీవో కాపీయే తరువాయి..
- Srikanth Odela: నాలుగేళ్లు గేటు బయటే నుంచుంటే సుకుమార్ కంట పడ్డా!
- Tags
తాజావార్తలు
-
Danam Nagender : దానం నాగేందర్ కేసులో బిగ్ ట్విస్ట్.. సుప్రీంకోర్టుకు అప్పీల్
-
Dishwasher Prices: మహిళలకు గిన్నెలు తోమే తిప్పలు తప్పినట్టే! భారీగా తగ్గిన డిష్వాషర్ల ధరలు..
-
US: అమెరికాస్ గాట్ టాలెంట్ షోలో అదరగొట్టిన చైనా రోబోలు.. వీడియో వైరల్
-
Deepika Padukone: నిన్ననే గుడిలో పూజలు.. మరోసారి ఆడబిడ్డకు జన్మనిచ్చిన దీపికా-రణ్వీర్!
-
Sandeep Reddy Vanga: వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఈ పేర్లు పెట్టండి.. సీఎం రేవంత్‌కు సందీప్ రెడ్డి వంగా స్పెషల్ రిక్వెస్ట్!
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!