FSSAI Liquor Notices: బీర్, విస్కీ, రమ్, తాగుతున్నారా?.. ఇది మీకోసమే..!
- బీర్, విస్కీ, రమ్, తాగుతున్నారా?
- దేశంలోని మద్యం తయారీ సంస్థలపై FSSAI కఠిన చర్యలు
- FSSAI ఎందుకు నోటీసులు జారీ చేసింది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలోని మద్యం తయారీ సంస్థలపై ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) కఠిన చర్యలకు దిగింది. ఆహార భద్రతా నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తించిన పలు మద్యం తయారీ కంపెనీలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అనుమతి లేని ఫ్లేవర్ల వినియోగం, ఉత్పత్తుల షెల్ఫ్ లైఫ్‌పై తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేస్తున్నారనే ఆరోపణలతో ఈ చర్యలు తీసుకుంది.
FSSAI ఎందుకు నోటీసులు జారీ చేసింది?
FSSAI తెలిపిన వివరాల ప్రకారం, Food Safety and Standards (Alcoholic Beverages) Regulations, 2018 నిబంధనలను ఉల్లంఘిస్తూ కొన్ని కంపెనీలు తమ మద్యం ఉత్పత్తుల్లో అనుమతి లేని ఫ్లేవర్లను ఉపయోగిస్తున్నట్లు గుర్తించింది. రమ్, విస్కీ, బ్రాందీ, జిన్, వైన్, బీర్ వంటి మద్యం ఉత్పత్తుల్లో సహజ రుచులను పోలి ఉండేలా అదనపు ఫ్లేవర్లను కలపడం నిబంధనలకు విరుద్ధమని సంస్థ స్పష్టం చేసింది.
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
షెల్ఫ్ లైఫ్‌పై తప్పుదోవ పట్టించే ప్రకటనలు
కొన్ని కంపెనీలు తమ ఉత్పత్తుల నిల్వ కాలం (Shelf Life) గురించి కూడా వినియోగదారులను తప్పుదోవ పట్టించే విధంగా ప్రచారం చేస్తున్నాయని FSSAI పేర్కొంది. ఈ అంశాలపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని సంబంధిత కంపెనీలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై చర్చించేందుకు మద్యం పరిశ్రమ ప్రతినిధులు, ఇతర భాగస్వాములతో FSSAI సమావేశం నిర్వహించనుంది. పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, అమలులో ఉన్న నిబంధనలపై చర్చించనున్నట్లు సమాచారం.
పరిశ్రమల సంఘం స్పందన
కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఆల్కహాలిక్ బెవరేజ్ కంపెనీస్ (CIABC) ఈ వ్యవహారంపై స్పందించింది. తమ సభ్య సంస్థలు FSSAI నిర్దేశించిన అన్ని నిబంధనలు, ప్రమాణాలను పాటిస్తున్నాయని పేర్కొంది. అలాగే నియంత్రణ సంస్థతో పూర్తిస్థాయిలో సహకరిస్తామని వెల్లడించింది.
వినియోగదారులకు దీని అర్థం ఏమిటి?
ప్రస్తుతం మార్కెట్లో విక్రయిస్తున్న మద్యం ఉత్పత్తులను ఉపసంహరించుకునేలా ఎలాంటి ఆదేశాలు జారీ కాలేదు. అయితే నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలితే సంబంధిత కంపెనీలపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఆహార భద్రతా ప్రమాణాలను కచ్చితంగా అమలు చేయడం, వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులు అందేలా చూడడం ఈ చర్యల ప్రధాన ఉద్దేశమని FSSAI వెల్లడించింది.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!