HHVM : పవన్ కల్యాణ్ యాక్ట్ చేసిన హరిహర వీరమల్లు మూవీ థియేటర్లలో ఆడుతోంది. ఎన్నడూ లేని విధంగా ఈ మూవీ కోసం పవన్ వరుసగా ప్రమోషన్లు చేశాడు. ప్రస్తుతం ట్రిమ్ చేసిన కంటెంట్ థియేటర్లలో రిలీజ్ చేశారు. టికెట్ రేట్లు కూడా తగ్గించారు. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా డైరెక్టర్ జ్యోతికృష్ణ వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. తాజా ఇంటర్వ్యూలో సెకండ్ పార్ట్ పై క్లారిటీ ఇచ్చారు. మేం ఈ మూవీ అనుకున్నప్పుడు ఒక్కటే పార్ట్ ఉండేది. క్రిష్ రాసుకున్న కథ ప్రకారం ఈ మూవీని కోహినూర్ డైమండ్ ను దొంగిలించే కాన్సెప్టుతో తీయాలనుకున్నాం. కానీ క్రిష్ తప్పుకున్న తర్వాత కథను రెండు భాగాలుగా మార్చేశాం అంటూ తెలిపారు జ్యోతికృష్ణ.
Read Also : Sanjay Dutt : రూ.72 కోట్ల ఆస్తి ఆమె ఫ్యామిలీకి ఇచ్చేశా..
మొదటి పార్టులో కోహినూర్ డైమండ్ దొంగిలించే కాన్సెప్ట్ ఒక్కటే ఉంటే సరిపోదని.. సనాతన ధర్మం గురించి రాసుకున్నాం. క్రిష్ రాసిన కోహినూర్ వజ్రం కాన్సెప్ట్ కథ వీరమల్లు సెకండ్ పార్ట్ లో ఉంటుంది. ఆయన రాసిన కథతోనే అది వస్తుంది. ఇప్పటికే 20 శాతం షూటింగ్ కూడా చేశాం. అది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అంటూ తెలిపాడు జ్యోతికృష్ణ. దాంతో సెకండ్ పార్ట్ పై అంచనాలు పెరుగుతున్నాయి. అయితే సెకండ్ పార్ట్ ను ఎవరు డైరెక్ట్ చేస్తారనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. జ్యోతికృష్ణనే దానికి కూడా డైరెక్టర్ గా చేస్తారనే ప్రచారం ఉన్నా.. క్రిష్ రాసుకున్న కథ కాబట్టి ఏమైనా మార్పులు ఉంటాయేమో అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇంకోవైపు సెకండ్ పార్టు వస్తుందా రాదా అనే సందేహాలు కూడా ఎక్కువయ్యాయి. ఎందుకంటే పవన్ ఇప్పుడున్న బిజీలో హీరోగా చేయలేనని చెబుతున్నారు. మరి ఈ సస్పెన్స్ లకు తెరపడాలంటే గట్టి అనౌన్స్ మెంట్ రావాల్సిందే.
Read Also : Sukumar : రామ్ చరణ్ కోసం రంగంలోకి సుకుమార్.. అక్కడ కథ రాస్తున్నాడట..