వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో, అతని భార్య సిలియా ఫ్లోర్స్‌ను సోమవారం హెల్లర్‌స్టెయిన్‌లోని మాన్‌హట్టన్ కోర్టులో హాజరుపరిచారు. 92 ఏళ్ల న్యాయమూర్తి ఆల్విన్ హెల్లర్‌స్టెయిన్ ఎదుట ఇద్దరిని నిలబెట్టారు. ఈ సందర్భంగా నార్కో-టెర్రరిజం, ఇతర ఆరోపణల్లో తాము నిర్దోషులమని తెలిపారు. న్యాయమూర్తి వాదనలు ఏంటి? అని అడిగినప్పుడు ‘‘నేను నిర్దోషిని.. నేను దోషిని కాదు. నేను మంచి వ్యక్తిని. దేశాధ్యక్షుడిని.’’ అని మదురో చెప్పుకొచ్చారు. ఇక తొలిసారి కోర్టుకు తీసుకు వచ్చినప్పుడు మదురో కుంటుతూ వచ్చారు.
ఇది కూడా చదవండి: Bangladesh: బంగ్లాదేశ్‌లో మరో హిందువు హత్య.. 24 గంటల్లో రెండో ఘటన
మదురో నీలిరంగు జైలు యూనిఫాం ధరించారు. భార్యతో కలిసి సోమవారం మధ్యాహ్నం కోర్టుకు వచ్చారు. శనివారం వెనిజులాలో అదుపులోకి తీసుకున్నాక.. అమెరికాలోని బ్రూక్లిన్ జైల్లో నిర్బంధించారు. అనంతరం సాయుధ దళాల సంరక్షణలో మాన్‌హట్టన్ కోర్టుకు హౌస్‌కు తరలించారు. ఆ సమయంలో మదురో సరిగ్గా నడవలేకపోయారు. కుంటుతూ వచ్చారు. ఇక న్యాయమూర్తి విచారణ తర్వాత తదుపరి కోర్టు విచారణ మార్చి 17కు వాయిదా వేశారు.
మదురోను అందరి ఖైదీల మాదిరిగానే అధికారులు చూడనున్నారు. ప్రత్యేకమైన వ్యక్తిగా ఎలాంటి వసతులు ఉండవు. క్రిమినల్ నిందితుడిగానే చూడనున్నారు. నేరం రుజువైన ఇతర ఖైదీల మాదిరిగా పరిగణించనున్నారు.
ఇది కూడా చదవండి: BCCI vs BCB: BCCI తో గొడవ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కొంప ముంచబోతుందా?
ఇదిలా ఉంటే వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలిగా డెల్సీ రోడ్రిగ్జ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తక్షణమే మదురోను విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాలో మదురోకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తిరిగి మదురోను అప్పగించాలని అమెరికాను డిమాండ్ చేశారు. ట్రంప్‌తో కలిసి పని చేస్తామని.. గౌరవప్రదమైన సంబంధాలను కలిగి ఉంటామని ఎక్స్‌లో పేర్కొన్నారు.