జనరల్ గా ఏనుగు అనగానే భారీ ఆకారంలో బలంగా కనిపిస్తుంది. కానీ, తన జీవితకాలమంతా పర్యాటకులను మోసి మోసి కృశించుకుపోయిన ఓ ఏనుగు దయనీయ పరిస్థితి మూగజీవుల పట్ల మనుషుల అమానవీయ ప్రవర్తనకు అద్దం పడుతుంది. ఏళ్ల తరబడి ఎంతో మందిని మోసిన ఆ ఏనుగు ఇప్పుడు నిర్వకారంగా మారిపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బక్కచిక్కపోయిన ఈ ఏనుగు ఫొటోను చూసి నెటిజన్స్ విభిన్న రితీలో కామెంట్స్ చేస్తున్నారు.
Also Read : MLC Elections: దొంగ ఓట్ల రాజ్యం.. ఉద్యోగులకు జీతాలు ఇవ్వరు.. కానీ..
థాయ్ లాండ్ కు చెందిన లిన్ అనే ఆడ ఏనుగు(71) 25 ఏళ్లుగా పర్యాటకశాఖలో సేవలు అందించింది. ట్రెక్కింగ్ విభాగంలో పని చేసిన ఈ ఏనుగు.. దశాబ్దాలుగా పర్యాటకులను మోయడంతో నిర్వికారంగా మారిపోయింది. కొన్ని సందర్భాల్లో ఈ ఏనుగుపై ఆరుగుర్ని ఒకేసారి ఎక్కించి తిప్పేవారు. పర్యాటకులను మోసి మోసి బక్క చిక్కిపోయిన ఈ గజరాజు ఫొటోను వైల్డ్ లైఫ్ ఫెండ్రస్ ఫౌండెషన్ ఇన్ థాయ్ లాండ్ తన ఇన్ స్టా గ్రామ్ పేజీలో పోస్ట్ చేస్తూ.. ఏనుగుల దయనీయ పరిస్థితిని వివరించింది.
Also Read : Washing powder Nirma: అమిత్ షా పర్యటన.. హైదరాబాద్‌లో ‘వాషింగ్ పౌడర్ నిర్మా’భారీ ఫ్లెక్సీలు
భారీ కాయంతో కన్పించే ఏణుగులు ఎంతటి బరువైనైపా మోయగలవు అనుకుంటే పొరబాటే.. వాటి వెన్నెముక.. అధిక బరువులను మోసేందుకు అనువుగా ఉండదు.. అలాంటిది వాటిపై నిరంతరం పర్యాటకులకు ఎక్కించడం వల్ల వాటి శరీరానికి శాశ్వత నష్టం వాటిల్లుతుంది.. దయచేసి ఎప్పుడూ ఏనుగు అంబారీ ఎక్కొద్దు.. ఈ సందేశాన్ని అందరికీ చేర్చండీ అంటూ డ్ల్యూఎఫ్ఎఫ్టీ రాసుకొచ్చింది. వన్యప్రాణుల సంరక్షణ కోసం పని చేసే ఈ సంస్థ ఇలాంటి ఎన్నో మూగజీవాలను కాపాడి తమ సంరక్షణ కేంద్రానికి తీసుకొచ్చింది. అందులో పై లివ్ కూడా ఒకటి. ప్రస్తుతం ఈ ఏనుగు తమ కేంద్రంలో స్వేచ్చగా విహరిస్తోందని డ్ల్యూఎఫ్ఎఫ్టీ తెలిపింది.
Also Read : PM Narendra Modi: నేడు కర్ణాటకలో మోదీ పర్యటన.. జేడీఎస్ కంచుకోటలో అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం
ఈ ఫొటోను చూస్తే పై లివ్ వెన్నెముక ఎలా వంగిపోయిందో తెలుస్తుంది.. సహజంగా వెన్నుముక గుండ్రంగా.. పైకిలేపి ఉంటుంది. ఏళ్ల తరబడి బరువులు ఎక్కించుకోవడం వల్ల భారీ బరువుతో వంగిపోయింది.. ఏనుగుల శరీరాలపై ఈ నిరంతర ఒత్తిడి కణజాలం, ఎముకలను క్షీణింపజేస్తుంది. వెనుకభాగంలో వెన్నెముకకు కోలుకోలేని భౌతిక నష్టం కలిగిస్తుంది అని తెలిపింది. ఇలాంటి మరో ఏనుగు బూన్ చ్యుయే ఫోటోను కూడా షేర్ చేసింది. ఈ ఏనుగు కూడా దశాబ్దాల పాటు బరువులు మోసి వెన్నుముక జారిపోయిందని పేర్కొంది.
Also Read : Viveka Murder Case: అరెస్టు చేసుకోండి.. అన్నింటికి సిద్ధమేనన్న భాస్కర్ రెడ్డి
ఈ ఫొటోలు ప్రస్తుతం సోసల్ మీడియాలో వైరల్ గా మారాయి. బక్కచిక్కిపోయిన ఏనుగుల ఫోటోలు చూసి చాలా మంది హృదయాలు చలించిపోతున్నాయి. ఇలాంటి కీలక విషయాన్ని అందరికీ తెలిసేలా చేసినందుకు పలువురు నెటిజన్లు WFFT సంస్థకు కృతజ్ఞతలు చెప్తున్నారు. మూగజీవుల పట్ల ఇలాంటి క్రూరత్వాన్ని వెంటనే ఆపాలని టూరిస్టు రైడ్లపై నిషేదం విధించాలని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. మన వినోదం కోసం జంతువులను హింసించే హక్క లేదు.. ఏనుగులు తమ కుటుంబాలతో స్వేచ్ఛగా ఉండే హక్కు ఉన్న సామాజిక అడవి జంతువులు ఇది భయానకం.. తమ హృదయం ద్రవిస్తోందని ఈ ఫొటో చూసిన వారందరు అంటున్నారు.