మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ అని అంటుంటారు. అంటే తల్లి, తండ్రి, గురువు దైవంతో సమానం అంటారు. భారతీయ సంస్కృతిలో తల్లిదండ్రులు, గురువుల పట్ల గౌరవం, భక్తి కలిగి ఉండాలని చెబుతుంటారు. కానీ ప్రస్తుత పరిస్థితులు భిన్నంగా మారిపోయాయి. నేటి కాలం పిల్లలకు గౌరవం, మర్యాదలు ఉండడం లేదు. ఆ మధ్య ఆంధ్రప్రదేశ్‌లో ఫ్రొఫెసర్ సెల్‌ఫోన్ తీసుకుందని విద్యార్థిని భౌతికదాడికి దిగింది. తాజాగా పరీక్షలో టీచర్ తక్కువ మార్కులు వేసిందని.. ఏకంగా క్లాస్ రూమ్‌లోనే ఉపాధ్యాయురాలిపై ఓ స్టూడెంట్ భౌతికదాడికి దిగాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Congress vs BJP: ఇటలీ పౌరురాలికి ఓటు ఎలా వచ్చింది.. సోనియాగాంధీపై బీజేపీ ఎదురుదాడి
థాయ్‌లాండ్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో నిర్వహించిన మిడ్ టర్మ్ పరీక్షలో రెండు మార్కుల తేడాతో మ్యాథ్స్ పరీక్షలో విద్యార్థి (17) ఫెయిల్ అయ్యాడు. 20 మార్కులకు గాను 18 మార్కులు మాత్రమే వచ్చాయి. దీంతో తోటి విద్యార్థుల ముందు తలెత్తుకోలేకపోయాడు. అవమానంగా భావించాడు. అంతే కోపం పట్టలేక అందరూ చూస్తుండగానే టీచర్ సీటు దగ్గరకు వెళ్లి అమాంతంగా పిడిగుద్దుల వర్షం కురిపించాడు. మహిళా టీచర్ అనే ఇంగిత జ్ఞానం లేకుండా చెంపదెబ్బలు కొట్టాడు. అంతేకాకుండా తన్ని, పంచ్‌లు గుద్దాడు. దీంతో ఈ దాడిలో టీచర్ ఎడమ కన్నుకు గాయాలయ్యాయి. అంతేకాకుండా తలకు వాపు వచ్చేసింది. అలాగే పక్కటెముకులు కూడా వాపునకు గురైనట్లుగా టెస్ట్‌ల్లో తేలాయి. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆగస్టు 5న జరిగిన సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి: BR Gavai: వీధి కుక్కల తీర్పుపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ కీలక ప్రకటన
ఇక ఈ ఘటనపై ఉపాధ్యాయురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలాగే విద్యార్థిని పాఠశాల నుంచి యాజమాన్యం సస్పెండ్ చేసింది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
A student beat his teacher up today because she did not give him a better mark in an exam in a school in Northeast Thailand
นักเรียนทำร้ายครูของตนวันนี้ เพราะเธอไม่ให้คะแนนสอบที่ดีกว่า ในโรงเรียนแห่งหนึ่งทางภาคตะวันออกเฉียงเหนือของประเทศไทย pic.twitter.com/28hxxNluF0— ADRIEN BRAY® (@Katareya2006) August 11, 2025