దేశ రాజధాని ఢిల్లీలో 8 వారాల్లోగా వీధి కుక్కలు లేకుండా చేయాలని ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. ఎవరైనా అడ్డుకుంటే కఠిన చర్యల తీసుకుంటామని సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. పిల్లల ప్రాణాలను దృష్టిలో పెట్టుకుని.. రేబిస్ బారిన పడకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు జస్టిస్ జేబీ పార్దివాలా, ఆర్.మహదేవన్లతో కూడిన ధర్మాసనం ఘాటుగా హెచ్చరించింది. తక్షణమే ఈ ప్రక్రియ చేపట్టాలని అధికారులకు సుప్రీం ధర్మాసనం ఆదేశించింది.
ఇది కూడా చదవండి: Maneka Gandhi: వీధి కుక్కలను షెల్టర్లకు పంపడమేంటి? సుప్రీంకోర్టు తీర్పును తప్పపట్టిన మేనకాగాంధీ
అయితే ఈ తీర్పును జంతు ప్రేమికులు, పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్రంగా వ్యతిరేకించారు. రాహుల్‌గాంధీ, మేనకా గాంధీ లాంటి సీనియర్ రాజకీయ ప్రముఖులతో పాటు సినీ ప్రముఖులు తీవ్రంగా వ్యతిరేకించారు. తీర్పును పరిశీలించాలంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్. గవాయ్‌కు లేఖలు రాశారు. అంతేకాకుండా తీర్పు వెలువడిన గంటల వ్యవధిలో ఢిల్లీలోని ఇండియా గేట్ దగ్గరకు వచ్చి ఆందోళనలు, నిరసనలు వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఇది కూడా చదవండి: Rajasthan: సుప్రీంకోర్టు బాటలోనే హైకోర్టు.. తక్షణమే వీధి కుక్కలు తొలగించాలని ఆదేశం
అయితే తాజాగా ఈ అంశంపై చీఫ్ జస్టిస్ గవాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తీర్పును పరిశీలిస్తానని హామీ ఇచ్చారు. వ్యతిరేకత వ్యక్తమవుతున్న తరుణంలో గవాయ్ నుంచి ఈ ప్రకటన వచ్చింది. బుధవారం ఉదయం ఈ అంశాన్ని గవాయ్ దృష్టికి తీసుకెళ్లడంతో పరిశీలిస్తామంటూ హామీ ఇచ్చారు.
ఇక సుప్రీంకోర్టు బాటలోనే రాజస్థాన్ హైకోర్టు ఉంది. తక్షణమే వీధి కుక్కలను తొలగించాలని ఆదేశించింది. ప్రజల సంక్షరణ కోసం వెంటనే చర్యలు చేపట్టాలని మున్సిపల్ అధికారులకు సూచించింది.