Pakistan: పాకిస్తాన్ దేశంలోని గత మూడు రోజులుగా పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నాయి. మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు మద్దతుగా పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) నేతలు, కార్యకర్తలు నిరసన కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆందోళనకారులను అణచి వేసేందుకు.. కనిపిస్తే కాల్చివేతకు షాబాజ్ షరీఫ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో నిరసన ప్రదర్శనలకు స్వస్తి పలుకుతున్నట్లు పీటీఐ కార్యకర్తలు ప్రకటించారు.
Read Also: Urvil Patel: విధ్వంసం.. 28 బంతుల్లోనే సెంచరీ
ఇక, పీటీఐ నిసరనల నేపథ్యంలో రాజధాని ఇస్లామాబాద్‌లోని డీ చౌక్‌లో హింసాత్మక ఘటనలు నెలకొన్నాయి. దీంతో పాక్ భద్రతా సిబ్బంది కఠిన చర్యలు అమలు చేయడంతో.. ఇమ్రాన్‌ఖాన్ మద్దతుదారులు నిరసనలు విరమిస్తున్నట్లు వెల్లడించారు. అయితే, తదుపరి వ్యూహం ఏమిటనేది ఇమ్రాన్ పార్టీ ఇంకా వెల్లడించలేదు. భద్రతా సిబ్బంది చేపట్టిన చర్యలను ఫాసిస్ట్ మిలిటరీ పాలనగా పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ అభివర్ణించింది.
Read Also: Parliament Winter Session: లోక్‌సభలో గందరగోళం.. సభ రేపటికి వాయిదా
అయితే, ఈ నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్న 450 మంది ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీలైనంత ఎక్కువ మందిని చంపాలనే ఉద్దేశ్యంతోనే పాక్ భద్రతా దళాలు నిరసనకారులపై కాల్పులు జరుపుతున్నాయని పిటిఐ నేతలు ఆరోపించారు. ఇక, పీటీఐ మద్దతుదారులు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణలో ఆరుగురు భద్రతా సిబ్బంది చనిపోగా.. పదుల సంఖ్యలో ఆస్పత్రి పాలయ్యారు. అలాగే, షాబాజ్-జర్దారీ-అసిమ్ కూటమి నేతృత్వంలో పాక్ భద్రతా దళాలు మారణహోం కోసం ట్రై చేస్తున్నాయని పీటీఐ ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ చేసింది. గత ఏడాది ఆగస్టు నుంచి జైలులో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ కు మద్దుతుగా నవంబర్ 24వ తేదీన దేశవ్యాప్త నిరసనలకు పీటీఐ పార్టీ చివరి పిలుపునిచ్చింది.