Urvil Patel: విధ్వంసం.. 28 బంతుల్లోనే సెంచరీ
- సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో
- గుజరాత్ క్రికెట్ జట్టు వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ఉర్విల్ పటేల్ చరిత్ర సృష్టించాడు.
- 28 బంతుల్లోనే సెంచరీ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Urvil Patel: ప్రస్తుతం జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో గుజరాత్ క్రికెట్ జట్టు వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ఉర్విల్ పటేల్ చరిత్ర సృష్టించాడు. త్రిపుర క్రికెట్ జట్టుపై కేవలం 28 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. ఈ టోర్నీ చరిత్రలో అత్యంత వేగంగా సెంచరీ చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. త్రిపుర అందించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పటేల్ ఇన్నింగ్స్ 35 బంతుల్లో 113 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 12 సిక్సర్లు బాదాడు. అతని టీ20 కెరీర్లో ఇదే తొలి సెంచరీ కూడా. అతని సెంచరీ సాయంతో త్రిపురపై గుజరాత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 32 బంతుల్లో (2018)లో సెంచరీ సాధించిన రిషబ్ పంత్ రికార్డును 26 ఏళ్ల ఉర్విల్ బద్దలు కొట్టాడు.
Also Read: V. Hanumantha Rao: వి.హనుమంతరావు కారును ఢీ కొట్టిన మరో వాహనం.. సీసీ ఫుటేజ్ లో దృశ్యాలు..
Also Read
- Telangana Food Safety: తెలంగాణలో ఫుడ్ సేఫ్టీ అధికారుల మెరుపు దాడులు.. 9 సంస్థల లైసెన్సులు రద్దు..
- Hyundai Ioniq P: క్రెటా ఈవీ కంటే తక్కువ ధర.. రూ.10 లక్షలలోపే హ్యుందాయ్ కొత్త ఎలక్ట్రిక్ కారు..!
- AB Venkateswara Rao: విజయవాడలో ఏబీవీ ప్రచార వాహనాలపై దాడి.. పోస్టర్లు చించివేత!
- Mumbai Indians: ఎంఐలో సంచలన మార్పులు.. బ్యాటింగ్ కోచ్‌గా ఉత్తప్ప.. మలింగ స్థానంలో మిచెల్, కొత్త కోచింగ్ స్టాఫ్ ఇదే..
దింతో పటేల్ ఇప్పుడు ప్రపంచ క్రికెట్లో T20 క్రికెట్ చరిత్రలో రెండవ ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఈ ఏడాది సైప్రస్‌తో జరిగిన టి20 అంతర్జాతీయ మ్యాచ్‌లో కేవలం 27 బంతుల్లో సెంచరీ చేసిన ఎస్టోనియా క్రికెట్ జట్టుకు చెందిన సాహిల్ చౌహాన్ మాత్రమే అతని కంటే ముందున్నాడు. ఈ జాబితాలో 30 బంతుల్లో సెంచరీ సాధించిన క్రిస్ గేల్ మూడో స్థానంలో ఉన్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన త్రిపుర 20 ఓవర్లలో 155/8 స్కోరు చేసింది. త్రిపుర ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ శ్రీదామ్ పాల్ 49 బంతుల్లో 57 పరుగులతో ఇన్నింగ్స్ ఆడాడు. ఇక లక్ష్య ఛేదనలో పటేల్ సెంచరీతో 10.2 ఓవర్లలో గుజరాత్ విజయానికి అవసరమైన స్కోరు సాధించింది. గుజరాత్‌కు చెందిన పటేల్, ఆర్య దేశాయ్ తొలి వికెట్‌కు 150 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టు విజయాన్ని ఖాయం చేశారు. ఇకపోతే, ముగిసిన IPL 2025 వేలంలో పటేల్‌ను ఏటీం కొనుగోలు చేయలేదు.
🏏🔥 Huge Congratulations to Gujarat CA Senior Men's Team! 🔥🏏
An outstanding performance to secure a brilliant 8-wicket victory over Tripura CA in the Syed Mushtaq Ali Trophy! 💪👏
The spotlight shines on Urvil Patel, who created history by smashing the fastest century in… pic.twitter.com/X7Mb90h2Dm
— Gujarat Cricket Association (Official) (@GCAMotera) November 27, 2024
తాజావార్తలు
-
Telangana Food Safety: తెలంగాణలో ఫుడ్ సేఫ్టీ అధికారుల మెరుపు దాడులు.. 9 సంస్థల లైసెన్సులు రద్దు..
-
PM Kisan 24th Installment Out: పీఎం కిసాన్ 24వ విడత విడుదల.. మీ ఖాతాలో రూ.2,000 పడ్డాయా? స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి
-
IND vs NZ 4th T20: వైభవ్, భువనేశ్వర్ అవుట్.. జట్టులోకి వచ్చిన ఆ ఇద్దరు.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!
-
Hyundai Ioniq P: క్రెటా ఈవీ కంటే తక్కువ ధర.. రూ.10 లక్షలలోపే హ్యుందాయ్ కొత్త ఎలక్ట్రిక్ కారు..!
-
AB Venkateswara Rao: విజయవాడలో ఏబీవీ ప్రచార వాహనాలపై దాడి.. పోస్టర్లు చించివేత!
ట్రెండింగ్
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!
-
IP66, IP68, IP69, IP69K రేటింగ్స్, 185Hz డిస్ప్లే, 9000mAh బ్యాటరీతో OnePlus Ace 7 లాంచ్..!
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, 1.5K LTPO AMOLED ఫ్లాట్ డిస్ప్లేతో OnePlus Ace 7 Pro లాంచ్..!
-
IND vs NZ: క్లీన్‌స్వీప్‌పై భారత్ కన్ను.. నేడే నాలుగో టీ20.. ప్లేయింగ్ XIలోకి ఇషాన్ కిషన్..!