ఉక్రెయిన్‌పై యుద్ధానికి మద్దతుగా రష్యాకు ఉత్తర కొరియా వేలాది మంది సైనికులను పంపించింది. ఇప్పటికే రష్యాలోని కుర్క్స్ ప్రాంతంలో మోహరించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ముందు ఉక్రెయిన్‌పై దాడి చేసేందుకు ప్రణాళికలు రచించినట్లు తెలుస్తోంది.
ఉక్రెయిన్‌పై రష్యా గత రెండేళ్లుగా యుద్ధం సాగిస్తోంది. ఉక్రెయిన్ కూడా దాడులను తిప్పికొడుతోంది. తాజాగా ఉక్రెయిన్‌పై రష్యా దాడులను పెంచేందుకు ఉత్తర కొరియా సాయం కోరింది. దీంతో కిమ్‌కు సంబంధించిన సేనలు రష్యాలోకి అడుగుపెట్టాయి. ఈ విషయాన్ని నాటో తాజాగా ధ్రువీకరించింది.
ఉత్తర కొరియా సైనిక జనరల్‌ను ఆయన తొలగించారు. అంతేకాదు, యుద్ధం వచ్చే ఛాన్స్ ఉందని, ఇందుకు రెడీ కావాలని సూచించినట్టు ఉత్తర కొరియా అధికారిక మీడియా తెలిపింది.