Pakistan: ‘‘ఇస్లామిక్ నాటో’’లో చేరండి.. ముస్లిం దేశాలకు పాకిస్తాన్ పిలుపు..
- ఇస్లామిక్ నాటోలో ముస్లిం దేశాలు చేరాలి..
- సౌదీ, టర్కీతో ఒప్పందం తర్వాత పాకిస్తాన్ పిలుపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: ఇటీవల సౌదీ అరేబియా-పాకిస్తాన్-టర్కీల మధ్య రక్షణ ఒప్పందం కుదిరింది. ‘‘మక్కా జాయింట్ అగ్రిమెంట్’’గా పిలుస్తున్న ఈ ఒప్పందం ప్రకారం, ఈ మూడు దేశాలు సైనికంగా సహకరించుకోవాలని నిర్ణయం తీసుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం, మూడు దేశాల్లో ఏ ఒక్క దేశంపైనా దాడి జరిగినా, ముగ్గురిపై జరిగినట్లే భావిస్తాయి. అయితే, ఈ కూటమిని మరింత విస్తరించాలని పాకిస్తాన్ భావిస్తోంది.
పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ముస్లిం దేశాలకు కీలక పిలుపునిచ్చారు. విభేదాలు అన్ని పక్కన పెట్టి మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్లో చేరాలని ఆయన కోరారు. నాటో తరహాలో ముస్లిం దేశాల సైనిక కూటమిగా దీనిని విస్తరించాలని సూచించారు. ఆ దేశ మీడియాతో మాట్లాడుతూ.. ఈ రక్షణ ఒప్పందం ఎక్స్‌క్లూజివ్ క్లబ్‌గా ఉండకూడదని అన్నారు. ఇతర దేశాలకు ఇందులో చేరే అవకాశం ఇవ్వాని, కూటమిని విస్తరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ముస్లిం దేశాలు తమ మధ్య ఉన్న విభేదాలు, ద్వైపాక్షిక వివాదాలను పక్కన పెట్టి ఒకే వేదికపై నిలబడాలని నాటో తరహాలో ఈ కూటమి పనిచేయాలని అన్నారు.
Also Read
- Saudi Arabia Oil: హోర్ముజ్ తర్వాత మరో షాక్.. మూతపడ్డ సౌదీ చమురు పైప్‌లైన్.. భారత్‌కు పెరిగిన కష్టాలు!
- Explainer: సిక్కులపై అమెరికా పగ పట్టిందా?
- China-India Air Connectivity: 6 ఏళ్ల తర్వాత మళ్లీ గ్వాంగ్జౌ-న్యూఢిల్లీ విమాన సర్వీసులు.. సెప్టెంబర్ 21 నుంచి రాకపోకలు
- BRICS Summit: అణిచివేతకు తలొగ్గం.. ఢిల్లీ వేదికగా అమెరికా, ఇజ్రాయెల్‌కు ఇరాన్ అధ్యక్షుడి మాస్ వార్నింగ్..!
సౌదీ అరేబియాని మక్కా వేదికగా సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్, టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్, పాకిస్థాన్ ప్రధాని షెహ్బాజ్ షరీఫ్‌లు శుక్రవారం ‘మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్’పై సంతకాలు చేశారు. టర్కీ విదేశాంగ మంత్రి హకాన్ ఫిరాన్ ఈ ఒప్పందాన్ని నాటోలోని ఆర్టికల్ 5కు సమానమైన పరస్పర రక్షణ వ్యవస్థగా అభివర్ణించారు. నాటో ఆర్టికల్ 5 ప్రకారం, ఏ దేశమైనా నాటోలోని సభ్యదేశంపై దాడి చేస్తే అది మొత్తం నాటోపై దాడిగా భావిస్తుంది.
టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ ఈ కూటమిని విస్తరించాలని భావిస్తున్నాడు. ఈజిస్ట్ సహా మరికొన్ని దేశాలు భవిష్యత్తులో ఇందులో చేరే అవకాశం ఉందని టర్కీ విదేశాంగ మంత్రి చెప్పారు. ఈ కూటమి ఇరాన్ లేదా మరే దేశానికి వ్యతిరేకంగా ఏర్పాటు కాలేదని స్పష్టం చేశారు. మూడు దేశాల భద్రతకు పరస్పరం మద్దతు ఇవ్వడమే దీని ఉద్దేశమని చెప్పారు. ఈ కూటమి ఏ దేశానికి వ్యతిరేకం కాదని పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ కూడా వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Krithi Shetty: కోలీవుడ్‌లో బేబమ్మకు దక్కని హిట్.. రిలీజ్ ఎప్పుడో తేలని రూ.100 కోట్ల సినిమా!
-
Ak 47 : ‘ఆదర్శ కుటుంబం’ చేతిలో AK47.. వెంకీ-త్రివిక్రమ్ మార్క్ మాస్ టీజర్ వచ్చేసింది!
-
Number Secrete: మొబైల్ నంబర్‌కు ముందు ‘+91’ ఎందుకు ఉంటుందో తెలుసా..? ఆ రహస్యం ఇదే..
-
Suhas : సముద్రంలో పడ్డ పీటర్ హెయిన్ .. పైకి లాగాబోతే షాక్!
-
PM Modi: ‘రూల్ టేకర్’ కాదు, ‘రూల్ షేపర్’గా మారాలి.. బ్రిక్స్ వేదికపై మోదీ పిలుపు
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!