వన్ ఇయర్ వర్కవుట్… ఎట్టకేలకు సన్నబడ్డ అర్జున్ కపూర్!

మామూలు వాళ్లు లావైతే నడవటం కష్టమవుతుంది. కానీ, సినిమా సెలబ్రిటీలకు బతుకుదెరువు నడవటం కూడా కష్టమవుతుంది. మరీ ముఖ్యంగా, బాలీవుడ్ హీరోలు, హీరోయిన్స్ కి వారి పిజిక్కే చాలా ముఖ్యం. రూపం కానీ చెడిపోయిందా… ఇక అంతే సంగతులు. ఎంత బరువు పెరిగితే కెరీర్ అంత భారంగా మారిపోతుంది!

బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ కి కూడా బరువే భారంగా మారి పదే పదే ఇబ్బంది పెడుతోంది. ‘ఇషక్ జాదే’ సినిమా సమయంలో సిక్స్ ప్యాక్ బాడీతో తెర మీద కొచ్చిన ఆయన తరువాత క్రమంగా వెయిట్ గెయిన్ చేశాడు. గత కొంత కాలంగా మరీ లావుగా కనిపించటంతో ట్రోలింగ్ కూడా మొదలైపోయింది. ఇక లాభం లేదనుకుని వర్కవుట్ లు, డైట్ లు ప్రారంభించిన అర్జున్ కి సంవత్సరం పట్టింది పర్ఫెక్ట్ ఫిజిక్ సాధించటానికి. అయితే, కొత్త రూపంలో అందర్నీ ఆశ్చర్యపరుస్తోన్న కపూర్ ఓ ఇంటర్వ్యూలో తన బరువు బాధల్ని అన్నిట్నీ… ఏకరువు పెట్టాడు!

Read Also : “నారప్ప” ఫేమ్ కార్తీక్ రత్నం ఇంటర్వ్యూ

అర్జున్ చిన్నప్పుడు కూడా లావబ్బాయేనట! పైగా తన సమస్య కేవలం అధిక బరువు మాత్రమే కాదు. కొన్ని ఇతరత్రా ఆరోగ్య సమస్యల వల్ల బరువు పెరగటం దానంతటదే జరిగిపోయేదట. ఇక తగ్గటం కూడా అంత ఈజీగా సాధ్యమయ్యేది కాదట. మిగతా వారితో పోలిస్తే బరువు తగ్గటానికి అర్జున్ కపూర్ కి రెట్టింపు సమయం పడుతుంది. అందుకే, ఇతరులు ఒక నెలలో సాధించింది రెండు నెలలు అదే పనిగా కష్టపడితే తప్ప అర్జున్ కి వీలు కాలేదట. మొత్తంగా గత సంవత్సర కాలంలో పూర్తి ఏకాగ్రతతో కొవ్వు కరిగించే పనిలోనే ఉన్నాడట!

చూడాలి మరి, తన తాజా సన్నటి… స్టనింగ్ లుక్… అర్జున్ ఎంత కాలం కాపాడుకుంటాడో! ఎప్పటికప్పుడు జిమ్ వర్కవుట్లతో పర్ఫెక్ట్ ఫిజిక్ మెయింటైన్ చేయటం ఒక్కటే బాలీవుడ్ లో క్రేజ్ కు కారణం. దానికి బదులు ఇంకేది చేసినా కమర్షియల్ సక్సెస్ కష్టమే మరి!

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-