Exoplanet: సౌర కుటుంబం తర్వాత విశ్వంలోని మిగతా గ్రహాలపై శాస్త్రవేత్తలు ఎన్నో ఎళ్లుగా దృష్టి సారించారు. ఇప్పటి వరకు వేల సంఖ్యలో ‘ఎక్సోప్లానెట్స్’ని శాస్త్రవేత్తలు గుర్తించారు.
James Webb Telescope: ఈ విశాల విశ్వం మన ఊహకు కూడా అందదు. విశ్వంలోని గెలాక్సీలు, బ్లాక్ హోల్స్, నక్షత్రాలతో పోలిస్తే భూమి ఇసుక రేణువు కన్నా తక్కువే. అయితే ఎప్పటికప్పుడు విశ్వ రహస్యాలను తెలుసుకోవాలను మానవుడి ఆశ అనేక ప్రయోగాలకు కారణం అవుతోంది. మనం ఉన్న గెలాక్సీ ‘‘ మిల్కీ వే’’ గురించే మనం ఇప్పటి వరకు పూర్తిగా తెలుసుకోలేకపోయాం. అలాంటిది ఈ విశ్వంలో కొన్ని కోటాను కోట్ల గెలాక్సీలు, అందులో లక్షల కోట్ల సంఖ్యలో…
James Webb telescope clicks Uranus: జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ విశ్వంలోని అనేక అద్భుతాలను మనముందు ఉంచుతోంది. హబుల్ టెలిస్కోప్ తో పోలిస్తే చాలా శక్తివంతమైన టెలిస్కోప్ అయిన జేమ్స్ వెబ్ విశ్వ మూలాల్లోని ఖగోళ అద్భుతాలను శాస్త్రవేత్తలకు అందిస్తోంది. విశ్వం పుట్టుక, అత్యంత పురాతన గెలాక్సీలు, నక్షత్రాల పుట్టుక, బ్లాక్ హోల్స్, పిల్లర్స్ ఆఫ్ క్రియేషన్స్ వంటి వాటిని భూమికి పంపించింది. విశ్వ రహస్యాలను చేధించేందుకు తన వంతు సహకారాన్ని అందిస్తోంది.
James Webb Telescope Captures The Iconic "Pillars Of Creation": నాసా జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అద్భుతాలను సృష్టిస్తోంది. సుదూర విశ్వంలోని అద్భుత దృశ్యాలను సంగ్రహిస్తోంది. విశ్వం పుట్టుకకు సంబంధించిన కీలక విషయాలను వెలుగులోకి తీసుకువస్తోంది. ఇప్పటి అనంత విశ్వానికి సంబంధించిన చిత్రాలను భూమికి పంపించింది జేమ్స్ వెబ్ టెలిస్కోప్. తాజాగా విశ్వంలోని ‘‘ పిల్లర్స్ ఆఫ్ క్రియేషన్’’ చిత్రాలను తీసింది.
James Webb Telescope Captures Images Of Cartwheel Galaxy: జెమ్స్ వెబ్ టెలిస్కోప్ విశ్వాంతరాల్లోని అద్భుతమైన ఫోటోలను భూమికి పంపిస్తోంది. మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్న అనేక గెలాక్సీ నిర్మాణాలను, నెబ్యులాలను క్యాప్చర్ చేస్తోంది. మునుపెన్నడూ లేని విధంగా చాలా స్పష్టతతో కూడిన అబ్బురపరిచే చిత్రాలను అందిస్తోంది. దీంతో విశ్వం తొలినాళ్లలో గెలాక్సీల నిర్మాణం, నక్షత్రాలు పుట్టుక, బ్లాక్ హోల్స్ గురించిన మరింత సమాచారాన్ని జెమ్స్ వెబ్ అందిస్తోంది
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఆ అద్భుత సమయం రానే వచ్చేసింది. నాసాకు చెందిన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ తీసిన తొలి అంతరిక్ష చిత్రం విడుదల అయ్యింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షరాలు కమలా హ్యారిస్ ఈ ఫోటోను వైట్‌హౌస్‌లో ఆవిష్కరించారు. కనులవిందుగా ఉండే ఈ చిత్రంలో నక్షత్రాలు, భారీ గేలక్సీలను మనం స్పష్టంగా చూడొచ్చు. ఈ సందర్భంగా.. మానవాళి ఇప్పటివరకూ చూడని సుదూరమైన ఇన్‌ఫ్రారెడ్ చిత్రం ఇదేనని నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ వెల్లడించారు.…
విశ్వాంతరాలను తెలుసుకోవాలనే ఉత్సాహం చాలా మందికి ఉంటుంది. మనం ఎవరం, ఈ విశ్వమేంటి.. అసలు మనం ఎక్కడ ఉన్నాం.. భూమి లాంటి గ్రహాలు మరెక్కడైనా ఉన్నాయా..? అనే సందేహాలు నిత్యం తొలుస్తూనే ఉంటాయి. ఇప్పటి వరకు మన పాలపుంత గెలాక్సీకి చెందిన వివరాలనే మనిషి పూర్తిగా తెలుసుకోలేకపోయాడు. అలాంటి కొన్ని బిలియన్ల గెలాక్సీలు అందులో కోటానుకోట్ల నక్షత్రాలు, మన ఊహకు కూడా అందని అంత విశ్వ రహస్యాలను కనుకునేందుకు మానవుడు అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు. అందులో భాగంగానే…