తేలికపాటి వర్షం కారణంగా ఢిల్లీ వాసులు తీవ్ర ఎండల నుండి ఉపశమనం పొందారు. వరుసగా ఆరు రోజులుగా తీవ్రమైన వేడిగాలుల తర్వాత.. శనివారం దేశ రాజధానిలో వాతావరణం కొద్దిగా మారిపోయింది. ఉదయం ఆకాశం మేఘావృతమై ఉంది. మధ్యాహ్నం కాసేపు సూర్యరశ్మి ఉన్నప్పటికీ మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో మళ్లీ ఆకాశం మేఘావృతమై ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో పాటు తేలికపాటి వర్షం కురిసింది. దీంతో.. ఆరు రోజుల తర్వాత శనివారం వేడిగాలుల నుండి కొంత ఉపశమనం లభించింది.
పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో విపరీతమైన ఎండలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ వేడిమి కారణంగా గ్యాస్ పేలుడు సంభవించి ఐదుగురు మరణించారు. దాదాపు 50 మంది గాయపడ్డారు. మృతుల్లో నలుగురు చిన్నారులు, ఒక మహిళ ఉన్నారు. ఈ మేరకు శుక్రవారం పోలీసులు సమాచారం అందించారు. సింధ్‌లోని హైదరాబాద్ ప్రాంతంలోని ఓ దుకాణంలో గ్యాస్ సిలిండర్ వేడి కారణంగా పేలిపోవడంతో ఈ సంఘటన చోటు చేసుకుంది. బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రోజు మరణించారని.. మంటల్లో గాయపడిన మరికొందరు…
Solar Storm: సూర్యుడి నుంచి మరో శక్తివంతమైన ‘‘సౌర తుఫాన్’’ భూమి వైపుగా దూసుకువస్తోంది. ఇది రేడియో బ్లాక్అవుట్, అరోరా బొరియాలిస్ లేదా నార్తర్న్ లైట్లకు దారి తీస్తుంది.
ఉత్తర భారత్‌ను తీవ్రమైన వడగాలులు హడలెత్తిస్తున్నాయి. గత కొద్ది రోజులు ఎండలు తీవ్రంగా మండిపోతున్నాయి. దీంతో బయటకురావాలంటేనే హడలెత్తిపోతున్నారు. ఉదయం నుంచే సూర్యుడు సుర్రుమంటున్నాడు. దీంతో వృద్ధులు, పిల్లలు బెంబేలెత్తిపోతున్నారు.
నాసా సూర్యుని ఉపరితలంపై రెండు పేలుళ్లను నమోదు అయ్యాయి. ఇవి శుక్రవారం, శనివారం శక్తివంతమైన సౌర మంటలను విడుదల చేశాయి. నాసా యొక్క సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ సౌర విస్ఫోటనాలను నమోదు చేసింది. ఇవి విద్యుదయస్కాంత శక్తి తరంగాలను భూమి వైపు పంపాయి. సూర్యుడు మే 10-11, 2024 న రెండు బలమైన సౌర మంటలను విడుదల చేశాడు. మే 10 న 9:23 p.m., మే 11 న 7:44 a.m. వద్ద గరిష్ట స్థాయికి…
Solar Storm: రెండు దశాబ్ధాలకు పైగా సంభవించిన అత్యంత శక్తివంతమైన సౌర తుఫానుల్లో ఒకటిగా శుక్రవారం భూమిని తాకింది. దీని వల్ల శాటిలైట్లు, పవర్ గ్రిడ్‌లకు అంతరాయం కలిగే అవకాశం ఉన్నట్లు శాస్త్రవేత్తలు హెచ్చరించారు.
Weather Department: వేసవి ప్రారంభం అయింది. మార్చి ప్రారంభంలోనే ఎండలు దంచికొడుతున్నాయి. మొదటి వారంలోనే వేడి విపరీతంగా పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో రోజువారీ ఉష్ణోగ్రతలు దాదాపు 5 డిగ్రీల వరకు పెరిగాయి.
Temperatures Increase in Telugu States: వేసవి ప్రారంభం అయింది. మార్చి ప్రారంభంలోనే ఎండలు దంచికొడుతున్నాయి. మొదటి వారంలోనే వేడి విపరీతంగా పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో రోజువారీ ఉష్ణోగ్రతలు దాదాపు 4 డిగ్రీల వరకు పెరిగాయి. తెలంగాణలోని పలు జిల్లాలలో శుక్రవారం (మార్చి 8) పగటి ఉష్ణోగ్రతలు దాదాపుగా 40 డిగ్రీల వరకు నమోదయ్యాయి. గత ఏడాది ఇదే సమయంలో 35 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు ఉన్నాయి. అంటే ఈసారి వేసవి ప్రారంభంలోనే ఎండలు మండిపోతున్నాయి. మరోవైపు ఏపీలోని…
Summer: తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగాయి. మార్చి రాకముందే రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఫిబ్రవరి ప్రారంభం నుంచి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి.
Sunspot: సూర్యుడు తన 11 ఏళ్ల సోలార్ సైకిల్‌లో చివరి దశలకు చేరుకున్నాడు. దీంతో సూర్యుడి ఉపరితలం క్రమంగా అలజడిగా మారుతోంది. గతంలో పోలిస్తే ప్రస్తుతం సన్‌స్పాట్స్, సౌర జ్వాలలు, కరోనల్ మాస్ ఎజెక్షన్స్ వంటి విషయాలు ఎక్కువ అవుతున్నాయి. సూర్యుడిపై ఏర్పడే భారీ పేలుళ్ల కారణంగా పదార్థం అంతరిక్షంలోకి వెదజల్లబడుతోంది. దీని కారణంగా భూమిపై సౌరతుఫానులకు ఏర్పడుతున్నాయి.