కెనడా 24వ ప్రధానమంత్రిగా మార్క్ కార్నీ శుక్రవారం అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఒట్టావాలోని రిడ్యూ హాల్‌లో గవర్నర్ జనరల్ మేరీ సైమన్ కార్నీ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయనతోపాటు మంత్రివర్గ సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. మార్క్ కార్నీ మాజీ సెంట్రల్ బ్యాంకర్. అతడు బ్యాంక్ ఆఫ్ కెనడా, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ రెండింటికీ నాయకత్వం వహించాడు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలో కెనడా అమెరికాతో వాణిజ్య ఉద్రిక్తతలను ఎదుర్కొంటున్న తరుణంలో ఆయన తన పదవీకాలాన్ని ప్రారంభించారు.
Also Read:Varun Chakravarthy: ఫోన్ ద్వారా బెదిరింపులు వచ్చేవి.. టీమిండియా క్రికెటర్ ఆవేదన
కెనడా ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్దిసేపటికే, ట్రంప్ సుంకాలను ఎదుర్కోవడం తన అగ్ర ప్రాధాన్యత అని కార్నీ అన్నారు. కెనడాను విలీనం చేసుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే చేస్తున్న బెదిరింపులను ఖండించాడు. ఈ సందర్భంగా ఆయన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. కెనడా ఎప్పటికీ యునైటెడ్ స్టేట్స్‌లో భాగం కాదని.. పొరపాటున కూడా ఆలోచించకు అని కార్నీ అన్నారు. ట్రంప్ ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా మార్క్ కార్నీ కఠినమైన నిర్ణయం తీసుకున్నారు.
Also Read:Trump: ఉక్రేనియన్ సైనికుల ప్రాణాలను కాపాడమని విజ్ఞప్తి చేసిన ట్రంప్.. పుతిన్ ఏమన్నారంటే?
అమెరికా కెనడా పట్ల కొంత గౌరవం చూపించే వరకు అమెరికన్ వస్తువులపై ప్రతీకార సుంకాలను కొనసాగిస్తానని ప్రతిజ్ఞ చేశారు. కెనడాను స్వాధీనం చేసుకోవడం గురించి ట్రంప్ పదే పదే చేసిన ప్రకటనలను కూడా ఆయన తిరస్కరించారు. “కెనడా సార్వభౌమాధికారం పట్ల గౌరవం ఉంటేనే” అమెరికా అధ్యక్షుడిని కలుస్తానని చెప్పారు. కెనడా విదేశాంగ మంత్రి మెలనీ జోలీ తెలిపిన వివరాల ప్రకారం.. రాబోయే రోజుల్లో కార్నీ- ట్రంప్ మధ్య చర్చలు ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం.