Sunita Williams: నింగిలోకి దూసుకెళ్లిన స్పేస్‌ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్..
- నింగిలోకి దూసుకెళ్లిన స్పేస్‌ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్
- ఈ నెల 20 తర్వాత సునీత, బుచ్ భూమికి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో చిక్కుకున్న భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ భూమికి తిరిగి రానున్నారు. అమెరికన్ అంతరిక్ష సంస్థ NASA- SpaceX ఆమెను, వ్యోమగామి బుచ్ విల్మోర్‌ను తిరిగి తీసుకురావడానికి ప్రయోగాన్ని ప్రారంభించాయి. స్పేస్‌ఎక్స్ శనివారం ఉదయం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)కు క్రూ-10 మిషన్‌ను ప్రయోగించింది. క్రూ డ్రాగన్ క్యాప్సూల్‌ను మోసుకెళ్లే స్పేస్‌ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ శనివారం ఉదయం 4.33 గంటలకు విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రయోగం ద్వారా నలుగురు కొత్త వ్యోమగాములను ISS కి పంపింది. వీరిలో నాసాకు చెందిన అన్నే మెక్‌క్లెయిన్, నికోల్ అయర్స్, JAXAకి చెందిన టకుయా ఒనిషి, రోస్కోస్మోస్‌కు చెందిన కిరిల్ పెస్కోవ్ ఉన్నారు.
Also Read:Pawan Kalyan : ఉత్తర భారత్, దక్షిణ భారత్ గా విడగొట్టద్దుః పవన్ కల్యాణ్
Also Read
- Ajit Agarkar Future: బీసీసీఐలో ‘కోల్డ్ వార్’..! అజిత్ అగార్కర్ పదవిపై ఉత్కంఠ.. 48 గంటల్లో కీలక నిర్ణయం..?
- Bushra Bano: 'అస్సలాము అలైకుమ్, ఇన్షా అల్లా, జజాకల్లాహ్" అంటూ మతపరమైన వ్యాఖ్యలు చేసిన IPS.. ఫిర్యాదు దాఖలు.!
- Abhishek Sharma Records: రికార్డుల మోతమోగించిన అభిషేక్ శర్మ..!
- Hyderabad: దారుణం.. హైదరాబాద్‌లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
మూడు రోజుల క్రితం సాంకేతిక సమస్యతో ప్రయోగం వాయిదా పడిన విషయం తెలిసిందే. శుక్రవారం తెల్లవారుజామున స్పేస్‌ఎక్స్ క్రూ-10 మిషన్ ప్రయోగించబోతున్న సమయంలో, ఫాల్కన్-9 రాకెట్ యొక్క గ్రౌండ్ సపోర్ట్ క్లాంప్ ఆర్మ్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో చివరి నిమిషంలో మిషన్‌ను రద్దు చేశారు. అయితే ఇప్పుడు సునీతా విలియమ్స్ అంతరిక్షం నుంచి తిరిగి రావడానికి మార్గం సుగమం అయ్యింది. మార్చి 19 నాటికి సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి బయలుదేరే అవకాశం ఉందని నాసా తెలిపింది.
Also Read:Tamannah – Vijay : బ్రేకప్ అనంతరం ఒకే చోట కనిపించిన తమన్నా, విజయ్
అన్నీ అనుకూలిస్తే ఈ నెల 20 తర్వాత సునీత, బుచ్ భూమికి చేరుకోనున్నట్లు తెలిపింది. సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ ఇద్దరు వ్యోమగాములు బోయింగ్ స్టార్‌లైనర్ అంతరిక్ష నౌకలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)కి వెళ్ళారు. కానీ స్టార్‌లైనర్‌లో సాంకేతిక లోపం కారణంగా తిరిగి రాలేకపోయారు. 9 నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో భారతీయ అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ చిక్కుకుపోయిన విషయం తెలిసిందే.
Liftoff of Crew-10! pic.twitter.com/OOLMFQgA52
— SpaceX (@SpaceX) March 14, 2025
తాజావార్తలు
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Ajit Agarkar Future: బీసీసీఐలో ‘కోల్డ్ వార్’..! అజిత్ అగార్కర్ పదవిపై ఉత్కంఠ.. 48 గంటల్లో కీలక నిర్ణయం..?
-
Bushra Bano: ‘అస్సలాము అలైకుమ్, ఇన్షా అల్లా, జజాకల్లాహ్” అంటూ మతపరమైన వ్యాఖ్యలు చేసిన IPS.. ఫిర్యాదు దాఖలు.!
-
Bethlehem Kudumba Unit: ‘లోకా: చాప్టర్ 1’ రికార్డ్ బద్దలు.. మలయాళంలో నంబర్ 1గా నివిన్ పౌలీ సినిమా!
-
Gurugram Road Rage: మహిళా బైకర్‌ను వెంబడించి ఢీకొట్టిన కారు? కెమెరాలో షాకింగ్ దృశ్యాలు
ట్రెండింగ్
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?