Breaking News: బలూచిస్తాన్‌లో రైలు హైజాక్, ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో పాక్ తాలిబన్ల దాడులతో పాకిస్తాన్ అట్టుడికిపోతోంది. ఎప్పుడు, ఎక్కడ, ఎలా దాడులు జరుగుతాయో తెలియని పరిస్థితి అక్కడ నెలకొంది. ట్రైన్ హైజాక్, ఆత్మాహుతి దాడులు జరిగిన కొన్ని గంటల్లోనే మరోసారి పాకిస్తాన్‌లో దాడి జరిగింది. పాకిస్తాన్ గిరిజన ప్రాంతమైన వజీరిస్తాన్‌లో శుక్రవారం ప్రార్థనలు జరుగుతున్న సమయంలో మసీదులో పేలుడు జరిగింది. ఈ ఘటనలో స్థానిక ఇస్లామస్ట్ నాయకుడు, పిల్లలతో సహా ముగ్గురు గాయపడినట్లు తెలుస్తోంది.
Read Also: Human Trafficking : వరంగల్‌లో కిలేడీ గ్యాంగ్ అరాచకాలు.. భయాందోళనలో తల్లిదండ్రులు
దేశంలోని వాయువ్య ప్రాంతంలోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని జామియత్ ఉలేమా ఇస్లాం-ఫజల్ (JUI-F) రాజకీయ పార్టీ స్థానిక నాయకుడు అబ్దుల్లా నదీమ్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ పేలుడు జరిగిందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం నదీమ్‌ని ఆస్పత్రిలో చేర్చారు. స్థానిక మీడియా కథనాల ప్రకారం, అతడి పరిస్థితి విషమంగా ఉంది. మౌలానా అబ్దుల్ అజీజ్ మసీదులో జరిగిన పేలుడులో గాయపడినవారిలో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని అక్కడి అధికారులు చెప్పారు. అయితే, ఈ పేలుడుకు ఇప్పటి వరకు ఎవరూ బాధ్యత ప్రకటించుకోలేదు.