Iran Nuclear Program: టెహ్రాన్‌లోని అణుశక్తి సంస్థను ఆదివారం ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ సందర్శించారు. ఈ సందర్భంగా పెజెష్కియాన్ దేశ అణు శాస్త్రవేత్తలు, అధికారులతో సమావేశమయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. టెహ్రాన్ తన అణు సౌకర్యాలను పునర్నిర్మించుకుంటుందని, ఇంకా ఎక్కువ శక్తితో వాటిని తిరిగి నిర్మిస్తామని చెప్పారు. “ఎన్ని భవనాలు, కర్మాగారాలు ధ్వంసమైనా, మేము వాటిని పునర్నిర్మిస్తాము, ఈసారి మరింత బలంగా ఉంటాము” అని ఆయన వెల్లడించారు. ఇరాన్ అణు కార్యక్రమం ఆయుధాల కోసం కాదు,…
US Strike: అమెరికా ఇరాన్‌పై దాడులు నిర్వహించిన కొన్ని రోజులు తర్వాత, తమ అణు సౌకర్యాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు ఇరాన్ ధ్రువీకరించింది. ఇరాన్‌లోని అత్యంత కీలకమైన, అణు కార్యక్రమాలకు కేంద్రంగా ఫోర్డో న్యూక్లియర్ ఫెసిలిటీ దెబ్బతిన్నట్లు శాటిలైట్ ఇమేజ్‌లు చూపిస్తున్నాయి. ఈ వారాంతంలో అమెరికా దాడుల్లో తమ దేశ అణు సౌకర్యాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఎస్మాయిల్ బఘై బుధవారం అన్నారు.
Hands off Iran: ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతుంది. ఈ వార్ లోకి అమెరికా ఎంట్రీ ఇవ్వడంతో పశ్చిమాసియా ఒక్కసారిగా భగ్గుమంది. ఈ ఉద్రిక్తతలతో యూఎస్ ప్రధాన నగరాల్లో ఇరాన్‌కి మద్దతుగా నిరసన ప్రదర్శనలు జరుగుతుండడం ఇప్పుడు తీవ చర్చనీయాంశంగా మారింది.
Padma Shri Garikapati Narasimha Rao: మహా సహస్రావధాని, ఆధ్యాత్మిక వేత్త, పద్మశ్రీ గరికపాటి నరసింహారావు గురించి తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారుండరు. తెలుగు వాళ్లు ఎక్కడ ఉన్నా.. ఆయన అవధానాలు వినే ఉంటారు. వ్యక్తిత్వ వికాసంపై ఆయన ఇచ్చే సందేశాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా యువత గరికపాటి సందేశాలను బాగా ఇష్టపడతారు. ప్రస్తుత సమాజానికి తగ్గట్టు మాట్లాడటం, ఏదేని విషయాన్ని కుండ బద్ధుల గొట్టినట్లు వివరించడం యువతను కట్టి పడేస్తుంది.
ఇరాన్ అణు కార్యక్రమాన్ని లక్ష్యంగా చేసుకుని అమెరికా మిడ్నైట్ హామర్ అనే చారిత్రాత్మక సైనిక చర్యను ప్రారంభించింది. ఈ ఆపరేషన్‌లో, 7 B-2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్లు 14 GBU-57 మాసివ్ ఆర్డినెన్స్ పెనెట్రేటర్ (MOP) బాంబులను ఇరాన్ అత్యంత సురక్షితమైన అణు స్థావరం అయిన ఫోర్డోపై జారవిడిచాయి. మాక్సర్ నుంచి వచ్చిన తాజా ఉపగ్రహ చిత్రాలు ఫోర్డో ఎగువ శిఖరంపై కనీసం 6 ఆయుధ ప్రవేశ రంధ్రాలు/క్రేటర్లను చూపిస్తున్నాయి. ఈ దాడులలో ఇరాన్ భారీ నష్టాలను…
ఇజ్రాయెల్-ఇరాన్ వివాదం చాలా ప్రమాదకరమైన దశకు చేరుకుంది. ఆదివారం ఉదయం, అమెరికా ఇరాన్ అణు కేంద్రాలపై దాడి చేసింది. అమెరికా చర్య తర్వాత, ప్రపంచంలో కలకలం రేగింది. ఈ సంఘటన జరిగిన కొన్ని గంటల తర్వాత, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్‌తో ఫోన్లో మాట్లాడారు. ప్రధాని మోదీ ఈ సమాచారాన్ని ఎక్స్ పోస్ట్ ద్వారా పంచుకున్నారు. ‘నేను ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్‌తో మాట్లాడాను. ప్రస్తుత పరిస్థితిపై వివరంగా చర్చించాము.…
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాట్లాడుతూ.. అణ్వాయుధాల తయారీకి ఇరాన్ ప్లాన్ చేస్తోందని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. ఇదే విషయాన్ని ఇప్పటికే ఇజ్రాయెల్‌కు అనేక సార్లు స్పష్టం చేశామని తెలిపారు.
ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. పరస్పరం బాంబుల మోత మోగిస్తున్నాయి. దీంతో పశ్చిమాసియా రణరంగంలా మారింది. ఇప్పటికే ఇరుదేశాల్లోని కీలక ప్రాంతాలు ధ్వంసమయ్యాయి. ఇజ్రాయెల్‌లోని సోరోకా హాస్పిటల్, స్టాక్ ఎక్స్ఛేంజ్ క్షిపణి దాడుల్లో ధ్వంసమైనట్లు తెలుస్తోంది.
Ayatollah Ruhollah Khomenei: మిడిల్ ఈస్ట్‌లో ఇజ్రాయిల్-ఇరాన్ సంక్షోభం ప్రపంచదేశాలను భయపెడుతోంది. అమెరికా జోక్యం ఉండటంతో ఇది మూడో ప్రపంచ యుద్ధంగా మారుతుందా..? అనే అనుమానాలు నెలకున్నాయి. మరోవైపు, ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ ట్రంప్, ఇజ్రాయిల్‌కి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తాము ఎవరికీ లొంగేది లేదని, యుద్ధం మొదలైందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Donald Trump: ఇరాన్ అణ్వాయుధాన్ని అభివృద్ధి చేయకుండా చూసుకోవడానికి ఇరాన్‌పై సైనిక దాడిలో అమెరికా ఇజ్రాయెల్‌తో చేరుతుందా లేదా అనే దాని గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడారు. వైట్ హౌజ్‌లో విలేకరులు ప్రశ్నించగా దీనిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ కావచ్చు, కాకపోవచ్చు. నేను ఏం చేయబోతున్నానో ఎవరికి తెలియదు’’ అని అన్నారు. గతవారంతో పోల్చితే ఇప్పటి పరిస్థితితో పెద్ద తేడా ఉందని మిడిల్ ఈస్ట్ సంక్షోభం గురించి అన్నారు.