Taslima Nasreen comments on hijab: బంగాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ ఇరాన్ లో జరుగుతున్న హిజాబ్ వ్యతిరేక నిరసనపై సంతోషం వ్యక్తం చేశారు. హిజాజ్ నిజానికి ఎంపిక కాదని.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలు, ఇరాన్ మహిళల నుంచి ధైర్యం పొందుతారని ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. నేను ఇరాన్ మహిళల నిరసనపై సంతోషంగా ఉన్నానని.. వారు హిజాబ్ తగలబెట్టడం, జట్టు కత్తిరించుకోవడం వంటి నిరసనలు తెలపడం.. ప్రపంచానికి, ముస్లిం మహిళలకు స్ఫూర్తినిస్తుందని ఆమె అన్నారు. హిజాబ్ అనేది మహిళల అణిచివేతకు, అవమానానికి చిహ్నంగా ఉందని.. తస్లిమా అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలంతా కూడా హిజాబ్ ను కాల్చివేసి, హిజాబ్ వ్యవస్థకు వ్యతిరేకంగా నిరసన తెలపాలని ఆమె సూచించారు.
Read Also: Jammu Kashmir: కాశ్మీర్‌లో ఇద్దరు హైబ్రిడ్ టెర్రరిస్టుల అరెస్ట్.. ఆయుధాలు స్వాధీనం
హజాబ్ ధరించాలనుకునే వ్యక్తులు ధరించాలని.. అయితే ఇష్టపడిన వ్యక్తుల కూడా హిజాబ్ ధరించని విధంగా హక్కుల్ని కలిగి ఉండాలని ఆమె అన్నారు. కుటుంబం, తల్లిదండ్రులు బలవంతంపై మహిళలు హిజాబ్ ధరించేలా చేస్తున్నారని ఆమె అన్నారు. కొంతమంది హిజాబ్ ధరించకపోతే కొడతారని.. వేధింపులకు గురిచేస్తారని భయపడుతున్నారని తస్లీమా ఆరోపించారు. మత ఛాందసవాదులు స్త్రీలు బురఖా, హిజాబ్ ధరించాలని బలవంత చేస్తారని.. హిజాబ్ మతపరమైన దుస్తులు కావని.. ఇది రాజకీయ హిజాబ్ మాత్రమే అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అణిచివేతకు గురవుతున్న ఇరాన్ స్త్రీలు తమ ధైర్యాన్ని ప్రదర్శిస్తున్నారని.. వారికి నా సెల్యూట్ అంటూ ప్రశంసలు కురిపించారు.
ఇటీవల ఇరాన్ లో మహ్స అమిని అనే 22 మహిళ హిజాబ్ ధరించలేదని ఆరోపిస్తూ.. అక్కడి మోరాలిటీ పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. గత శుక్రవారం ఆమె కోమాలోకి వెళ్లి చికిత్స పొందుతూ మరణించింది. ఈ వివాదం దేశంలో ఆందోళనకు కారణం అయింది. మహ్స అమిని మరణం యువత, మహిళల్లో ఆగ్రహాన్ని రగిల్చింది. దీంతో ఇరాన్ మహిళలు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ ఎత్తున నిరసనలు చేపడుతున్నారు. హిజాబ్ తీసేసి, జట్టు కత్తిరించుకుని నిరసన తెలుపుతున్నారు. రాజధాని టెహ్రాన్ తో పాటు దేశవ్యాప్తంగా మహిళలు ఆందోళనలు చేపట్టారు.