Taslima Nasreen: 2021లో ఆఫ్ఘానిస్తాన్ లో తాలిబాన్‌లు అధికారంలోకి వచ్చిన తర్వాత, తొలిసారిగా ఆ దేశ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ భారత్‌లో పర్యటిస్తున్నారు. శుక్రవారం, భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌తో ఆయన భేటీ అయ్యారు. ఆ తర్వాత, తాలిబాన్ ప్రతినిధి బృందం మీడియా సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో ఒక్క మహిళా జర్నలిస్టు లేకపోవడంపై చర్చ నడిచింది. తాలిబాన్లు మహిళల్ని దూరంగా పెడుతున్నారనే వాదన వినిపించింది.
Islam- Terrorism: ప్రపంచ దేశాల్లో ఇస్లాం ఉన్నంత వరకూ ఉగ్రవాదం బ్రతికే ఉంటుందని బంగ్లాదేశ్ బహిష్కృత రచయిత తస్లీమా నస్రీన్ తెలిపారు. పహల్గాం దాడిని, 2016లో ఢాకాలో జరిగిన ఉగ్రదాడితో పోల్చారు.
Rakhi Sawant Marriage - Taslima Nasreen comments: వివాదాస్పద రచయిత్రి తస్లిమా నస్రీన్ మరోసారి ఇస్లాంపై వ్యాఖ్యలు చేశారు. ఇస్లాం ఛాందసవాదాన్ని ఎదురించిన తస్లిమా సొంత మతం నుంచే బెదిరింపులు, దాడులకు గురైంది. ఇస్లాంలోని తప్పులను ఎత్తి చూపడంలో ముందుంటారు. ఇదిలా ఉండే ఆమె మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. వాక్ స్వాతంత్య్రం, స్త్రీల సమానత్వం, ముస్లిమేతర హక్కులు మొదలైనవాటిని అంగీకరించాలని లేకపోతే ఆధునిక సమాజంలో దీనికి స్థానం ఉండదని అన్నారు.
Taslima Nasreen comments on hijab: బంగాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ ఇరాన్ లో జరుగుతున్న హిజాబ్ వ్యతిరేక నిరసనపై సంతోషం వ్యక్తం చేశారు. హిజాజ్ నిజానికి ఎంపిక కాదని.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలు, ఇరాన్ మహిళల నుంచి ధైర్యం పొందుతారని ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. నేను ఇరాన్ మహిళల నిరసనపై సంతోషంగా ఉన్నానని.. వారు హిజాబ్ తగలబెట్టడం, జట్టు కత్తిరించుకోవడం వంటి నిరసనలు తెలపడం.. ప్రపంచానికి, ముస్లిం మహిళలకు స్ఫూర్తినిస్తుందని ఆమె అన్నారు. హిజాబ్…
రాజస్థాన్ ఉదయ్ పూర్ లో కన్హయ్య లాల్ దారుణ హత్య దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. అత్యంత పాశవికంగా ఇద్దరు మతోన్మాదులు హత్య చేయడాన్ని యావత్ దేశం ఖండిస్తోంది. మహ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్శ చేసిన అనుచిత వ్యాఖ్యలకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడనే కారణంతో మహ్మద్ రియాజ్, గౌస్ మహ్మద్ అనే ఇద్దరు దుండగులు గొంతు కోసి తలవేరు చేసి చంపారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఘటనపై ప్రముఖులతో పాటు…
వివాదాస్పద బంగ్లాదేశ్ రచయిత్రి తస్లిమా నస్రీన్ భారత్ లో జరుగుతున్న హింసాకాండపై స్పందించారు. మాజీ బీజేపీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు, ఆ తరువాత భారత్ లో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లిం మతోన్మాదుల పిచ్చిని చూసి తాను షాక్ అయ్యానని వ్యాఖ్యానించారు. ప్రవక్త ముహమ్మద్ ఈ రోజు జీవించి ఉన్నా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం మతోన్మాదుల వెర్రితనాన్ని చూసి అతను షాక్ అయ్యి ఉండేవాడు. మానవుడు,…