ఈమధ్య ఉద్యోగాలు చేసేవారికన్నా ఉద్యోగాలు వదిలేసి వ్యవసాయం చేసేవారి సంఖ్య పెరిగిపోతుంది.. ఇక మరోవైపు రైతులు ఆదాయం లేదని ఆవేదన చెందుతున్నారు.. రైతులు వ్యవసాయం చేసి నానాటికి అప్పుల ఊబిలోకి కూరుకుపోతున్నారు.. ఇలాంటి పరిస్థితుల్లో.. ఓ జర్నలిస్టు తన జాబ్ వదిలేసి మరి..వ్యవసాయం చేస్తున్నాడు. అయితే.. ఇతను మాత్రం ఆధునిక పద్దతిలో పంటలు పండిస్తూ.. లక్షల్లో సంపాదిస్తున్నాడు.. వావ్ సూపర్ కాస్త.. అతని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఉత్తరప్రదేశ్‌లోని బరేలీకి చెందిన రాంవీర్ సింగ్.. ఈయన జర్నలిస్ట్.. మంచి జీతం వస్తుంది.. అయితే ఓసారి తన స్నేహితుడి మేనమామ క్యాన్సర్ బారిన పడడానికి కారణం కెమికల్‌తో కూడిన కూరగాయల వలన అని పరిశోధనలో తెలిసిందట… దీంతో రామ్‌వీర్ సింగ్‌లో భయం మొదలైంది. తన కుటుంబాన్ని అలాంటి ప్రమాదాల నుండి కాపాడాలని అప్పుడే ఫిక్స్ అయ్యాడట.. తన ఉద్యోగాన్ని విడిచిపెట్టి పూర్వీకులు ఇచ్చిన భూమిలో సేంద్రీయ కూరగాయలను పండించాలనుకున్నాడు.. అయితే తన పొలం చాలా దూరంలో ఉండటంలో అతను ఫ్రీలాన్స్ జాబ్ చేసేవాడు.. అటు వ్యవసాయంలో సక్సెస్ అయ్యాడు.. రెండు బ్యాలెన్స్ చేస్తూ హీరో అయ్యాడు.. అందరికీ ఆదర్శంగా మారాడు..
దుబాయ్‌లో హైడ్రోపోనిక్స్ వ్యవసాయం గురించి తెలుసుకున్నాడు. ఈ వ్యవసాయ పద్ధతికి నేల అవసరం లేదు, తక్కువ కీటకాలతో సాగు చేయవచ్చు. అంతేకాదు మొక్కల పెరుగుదలకు అవసరమైన నీటిలో దాదాపు 80% ఆదా అవుతుందని తెలిసింది.. దాని గురించి పూర్తిగా తెలుసుకున్న అతను తన మూడంతస్తుల భవనాన్ని హైడ్రోపోనిక్స్ ఫామ్‌గా మార్చేశాడు. ఓ వైపు ఆరోగ్యకరమైన కూరగాయలను పొందుతూనే మరోవైపు ఏడాదికి లక్షలు సంపాదించాడు.. అలా రకరకాల కూరగాయలను పండించడం మొదలు పెట్టాడు..వింపా ఆర్గానిక్ అండ్ హైడ్రోపోనిక్స్ ఎంటర్‌ప్రైజ్‌ను స్థాపించిన రామ్‌వీర్ ఇప్పుడు సంవత్సరానికి రూ.70 లక్షల ఆదాయాన్ని పొందుతున్నాడు… గ్రేట్ కదా..