లెబనాన్‌లో ఇజ్రాయెల్ దాడులు చేశాయి. ఈ దాడుల్లో హమాస్ ఆపరేషన్స్ అధిపతి ముహమ్మద్ షాహీన్ హతమయ్యాడు. షాహీన్.. ఇరాన్ డైరెక్షన్, నిధులతో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లుగా ఐడీఎఫ్ గుర్తించింది. ఇజ్రాయెల్ పౌరులపై ఉగ్ర దాడులు ప్లాన్ చేయడంలో షాహీన్ హస్తం ఉన్నట్లుగా గుర్తించింది. ప్రస్తుతం లెబనాన్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం నడుస్తోంది. దక్షిణ లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ తన దళాలను ఉపసంహరించుకుంటున్న సమయంలో ఈ దాడికి పాల్పడింది.
ఇది కూడా చదవండి: Tuni Municipal Vice Chairman Election: తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక నాలుగోసారి వాయిదా!
సిడాన్ ప్రాంతంలో జరిగిన దాడిలో షాహీన్ హతమైనట్లుగా ఐడీఎఫ్ తెలిపింది. ఇతడు హమాస్ జరిగించిన ఆపరేషన్‌లో కీలకంగా ఉన్నట్లుగా తెలిపింది. అంతేకాకుండా వివిధమైన దాడుల్లో ఇతని పాత్ర స్పష్టంగా ఉందని పేర్కొంది. షాహీన్ ఆధ్వర్యంలో.. ఇజ్రాయెల్‌పై రాకెట్ దాడులు చేశాడని ఇజ్రాయెల్ తెలిపింది.
ఇది కూడా చదవండి: SamyuktaMenon: నేను మందేస్తా.. అయితే ఏంటి?.. స్టార్ హీరోయిన్ సంచలనం