లెబనాన్‌లో ఇజ్రాయెల్ దాడులు చేశాయి. ఈ దాడుల్లో హమాస్ ఆపరేషన్స్ అధిపతి ముహమ్మద్ షాహీన్ హతమయ్యాడు. షాహీన్.. ఇరాన్ డైరెక్షన్, నిధులతో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లుగా ఐడీఎఫ్ గుర్తించింది.
హిజ్బుల్లా లక్ష్యంగా సోమవారం లెబనాన్‌పై ఇజ్రాయెల్ భారీ దాడులకు పాల్పడింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 28 చిన్నారుల సహా 558 మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది గాయాలు పాలయ్యారు.