లెబనాన్‌లో ఇజ్రాయెల్ దాడులు చేశాయి. ఈ దాడుల్లో హమాస్ ఆపరేషన్స్ అధిపతి ముహమ్మద్ షాహీన్ హతమయ్యాడు. షాహీన్.. ఇరాన్ డైరెక్షన్, నిధులతో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లుగా ఐడీఎఫ్ గుర్తించింది.
హమాస్ అంతమే లక్ష్యంగా నూతన సంవత్సరం వేళ కూడా ఇజ్రాయెల్ వేట సాగిస్తోంది. న్యూఇయర్ వేళ జరిపిన దాడుల్లో పదుల కొద్దీ చనిపోగా.. ఇక తాజాగా జరిగిన దాడుల్లో హమాస్ అగ్ర అధికారులతో సహా 10 మంది చనిపోయారు.