Meta: మెటాకు భారీ షాక్.. ఫేస్బుక్, ఇన్‌స్టా వ్యసనంపై రూ.133 లక్షల కోట్ల కేసు!
- మెటాపై అమెరికాలో మరో కీలక న్యాయపోరాటం..
- పిల్లలు, యువతను సోషల్ మీడియాకు బానిసలుగా మార్చారనే ఆరోపణ..
- COPPA ఉల్లంఘనకు పాల్పడిందని మెటాపై 29 రాష్ట్రాల ఆరోపణలు..
- మెటా అఫిడవిట్ ప్రకారం $1.4 ట్రిలియన్ వరకు జరిమానా కోరే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Meta: ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మాతృసంస్థ మెటా ప్రపంచవ్యాప్తంగా న్యాయపరమైన ఇబ్బందుల్ని ఎదుర్కొంటోంది. మెటా సోషల్ మీడియాలు వ్యవసానికి కారణమవుతున్నాయని, ఇదే కాకుండా దాని యాప్‌లు పిల్లల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయని అమెరికాలో మెటా అనేక పిటిషన్లను ఎదుర్కొంటోంది. మెటా 1.4 ట్రిలియన్ డాలర్ల (సుమారు రూ. 133.92 లక్షల కోట్లు) వరకు జరిమానాలను కూడా ఎదుర్కోవచ్చు. ఈ కొత్త కేసు విచారణ కాలిఫోర్నియాలోని ఓక్లాండ్లో ఉన్న ఫెడరల్ కోర్టులో మంగళవారం ప్రారంభం కానుంది. గత వారం, మెటా ఈ కేసును కొట్టివేయాలని కోరింది, కానీ ఆ కంపెనీ అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది.
ఈ కేసులో మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్, ఇన్స్టాగ్రామ్ అధిపతి ఆడమ్ మొసేరీ సహా కంపెనీ సీనియర్ అధికారులు సాక్ష్యం చెప్పాల్సి వచ్చే అవకాశం ఉంది. ఈ కంపెనీ భారీ జరిమానా ఎదుర్కోవచ్చు. యూజర్లను తన ప్లాట్‌ఫామ్‌లకు బానిసలుగా చేసే ఫీచర్లను మెటా ఉద్దేశపూర్వకంగా అమలు చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. 2023లో అమెరికాలో పలు రాష్ట్రాలు మెటాపై ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశాయి. కంపెనీ భద్రతా విధానాలపై పలు రాష్ట్రాలు దర్యాప్తు జరిపి, మెటా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్ వల్ల పిల్లలు, కౌమార దశలో ఉన్నవారికి తీవ్రమైన హాని జరుగుతుందని వెల్లడి కావడంతో ఈ చర్య తీసుకున్నారు.
Also Read
- Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
కాలిఫోర్నియా, కొలరాడో, కెంటకీ, న్యూజెర్సీ సహా మొత్తం 29 రాష్ట్రాలు మెటా పిల్లల ఆన్లైన్ గోప్యతా పరిరక్షణ చట్టం COPPAను ఉల్లంఘించిందని ఆరోపించాయి. 13 ఏళ్లలోపు పిల్లలు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఉపయోగిస్తున్నారని మెటాకు తెలిసినప్పటికీ, వారి తల్లిదండ్రుల సమ్మతి లేకుండా వారి డేటాను సేకరించిందనేది మరో ప్రధాన ఆరోపణ ఉంది. ఈ కేసులో రాష్ట్రాలు $1.4 ట్రిలియన్ వరకు జరిమానా కోరే అవకాశం ఉందని కంపెనీ పేర్కొంది.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!