ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు ఓ మహిళ కాల్ చేసిన ఘటన హాట్ టాపిక్ గా మారింది. గల్ఫ్ లో మంచి ఆఫర్ ఉందంటూ ఎమ్మెల్యేకు ఓ కన్సల్టెన్సీ మహిళ ఫోన్ చేసింది. నువ్వు ఎవ్వరికి ఫోన్ చేశావో తెలుసా అంటూ ఎమ్మెల్యే ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యేతో మహిళ వాగ్వాదానికి దిగింది. మహిళ తీరుపై సదరు ఎమ్మెల్యే ఎస్పీకి ఫిర్యాదు చేశారు. లక్ష్మీ మ్యాన్ పవర్ కన్సల్టెన్సీపై సుమోటోగా కేసు నమోదు చేశారు…
Pakistan: పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంతో ప్రపంచం ముందు భిక్షమెత్తుకుంటోంది. ఇక పాక ప్రజలు కూడా దీన్నే ఫాలో అవుతున్నారు. ముఖ్యంగా సౌదీ అరేబియా, యూఏఈ వంటి గల్ఫ్ దేశాలకు కూలీలుగా వెళ్తున్న వారు అక్కడ భిక్షాటన చేస్తుండటం ఆ దేశాలకు ఇబ్బందికరంగా మారాయి.
గల్ఫ్ దేశంలో త్వరలోనే ఐఐటి ఢిల్లీ ప్రవాస క్యాంపస్‌ను ప్రారంభించనుంది. అక్కడ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) క్యాంపస్‌ను ఏర్పాటు చేసేందుకు విద్యా మంత్రిత్వ శాఖ మరియు అబుదాబి విద్యా మరియు నాలెడ్జ్ శాఖ (ADEK) ఒప్పందంపై సంతకం చేశాయి. ప్రధాని నరేంద్ర మోదీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) పర్యటన సందర్భంగా అవగాహన ఒప్పందం (ఎంఓయూ)పై సంతకాలు చేశారు.
అదనంగా డబ్బు సంపాదించి, తమ కుటుంబానికి ఏ కష్టం రాకుండా చూసుకోవాలని ఎంతో మంది భావిస్తారు.. ఎన్నో ఆశలతో విదేశాలకు వెళ్తారు.. అయితే, ఇదే సమయంలో.. కొందరు ఏజెంట్ల బారిన పడి.. నిండా మునగడమే కాదు.. జైలులో మగ్గాల్సిన పరిస్థితి.. సంపాదన లేదు.. కుటుంబానికి దూరమై.. జైలులో ఒంటరిగా మగ్గాల్సిన దుస్థితి ఏర్పడుతుంది.. ఆంధ్రప్రదేశ్‌లోని అమలాపురం జిల్లాకు చెందిన మహిళలు నకిలీ వీసా ఏజెంట్ల బారిన పడ్డారు. నకలీ వీసా మోసానికి గురైన పలువురు మహిళలు కేరళలో…
ప్రపంచంలో డెల్టా వేరియంట్ కొన్ని దేశాల్లో విజృంభిస్తున్నది. అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో కరోనా ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదు. అమెరికాలో కేసులు పెద్ద సంఖ్యలోనే నమోదవుతున్నాయి. దీంతో ఆ దేశంనుంచి వచ్చే వారిపై కొన్ని దేశాల్లో ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే, ఆసియాలోని గల్ఫ్ దేశాల్లో కరోనా కాస్త శాంతించింది. గల్ఫ్ లోని కొన్ని దేశాల్లో కరోనా చాలా వరకు తగ్గుముఖం పట్టడంతో ఆయా దేశాల్లో తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి.…