Colgate: కొల్గేట్ ప్రియులకు షాక్.. టూత్‌పేస్ట్ ధరలు పెరగనున్నాయా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Colgate: సామాన్యుల ఇంటి బడ్జెట్‌పై మరో భారం పడే అవకాశం కనిపిస్తోంది. ప్రముఖ ఓరల్ కేర్ సంస్థ కొల్గేట్-పామోలివ్ ఇండియా రానున్న త్రైమాసికాల్లో తమ ఉత్పత్తుల ధరలను మరింత పెంచే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ముడి పదార్థాల వ్యయాలు పెరుగుతుండటంతో.. లాభాల మార్జిన్‌ను కాపాడుకునేందుకు ధరల పెంపు దిశగా కంపెనీ అడుగులు వేస్తున్నట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. ద్రవ్యోల్బణం ఇప్పటికీ ఆందోళన కలిగించే అంశమేనని కంపెనీ సీఈఓ, ఎండీ ప్రభా నరసింహన్ తెలిపారు. అయితే ధరల విషయంలో సున్నితంగా ఉండే వినియోగదారులపై అధిక భారం పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
రూ.10, రూ.20 ప్యాక్‌లలో అదనపు గ్రామేజీ
జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాన్ని వినియోగదారులకు అందించేందుకు గతేడాది చిన్న ప్యాక్‌ల బరువును పెంచినట్లు ప్రభా నరసింహన్ తెలిపారు. ప్రస్తుతం కూడా ఆ అదనపు గ్రామేజీని కొనసాగిస్తున్నామని చెప్పారు. ముఖ్యంగా రూ.10, రూ.20 ప్యాక్‌లలో పెంచిన బరువును అలాగే ఉంచినట్లు వెల్లడించారు. దీంతో వినియోగదారులకు మెరుగైన విలువ లభిస్తుందని కంపెనీ భావిస్తోంది. అయితే పెరుగుతున్న ముడి పదార్థాల ధరల నేపథ్యంలో ఇటీవలి త్రైమాసికాల్లో కొల్గేట్ ఉత్పత్తుల ధరలను సింగిల్ డిజిట్ స్థాయిలో స్వల్పంగా పెంచినట్లు సమాచారం. భవిష్యత్తులోనూ ఎంపిక చేసిన ఉత్పత్తులపై ధరల పెంపు ఉండే అవకాశం ఉంది. ఇన్పుట్ ఖర్చులను నియంత్రించడంతో పాటు అమ్మకాలను పెంచుకునేందుకు ప్రీమియం ఉత్పత్తులపై కంపెనీ దృష్టి సారిస్తోంది. కొల్గేట్ ప్రకారం.. ప్రీమియం విభాగం మొత్తం మార్కెట్ వృద్ధి రేటుతో పోలిస్తే సుమారు ఆరు రెట్లు వేగంగా పెరుగుతోంది. టూత్‌పేస్ట్, టూత్‌బ్రష్ విభాగాల్లో ప్రీమియం ఉత్పత్తులకు మంచి అవకాశాలు ఉన్నాయని కంపెనీ చెబుతోంది. ఓరల్ కేర్ మార్కెట్లో కొల్గేట్కు పెప్సోడెంట్, క్లోజప్, సెన్సోడైన్, పతంజలి వంటి బ్రాండ్ల నుంచి పోటీ ఉంది. అదే సమయంలో కోర్ బ్రాండ్లను మరింత బలోపేతం చేసేందుకు ప్యాకేజింగ్, ఉత్పత్తి అనుభవాన్ని మెరుగుపరచాలని కంపెనీ భావిస్తోంది.
Also Read
- PM Modi: UPI తదుపరి స్థాయికి సిద్ధం.. ప్రపంచమంతా విస్తరించాలన్న మోడీ
- Airlines: కీలక పండుగల వేళ ఛార్జీలకు రెక్కలు.. భారీగా పెంచేసిన విమాన సంస్థలు
- Bank Strike Alert: బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్! సెప్టెంబర్ 11న బ్యాంకులు బంద్..
- Air India: ఎయిరిండియా కొత్త సీఈవో ముందు సవాలు.. కోలుకోవడానికి దశాబ్దం పట్టే ఛాన్స్
గ్రామీణ మార్కెట్లలో పెరిగిన అమ్మకాలు
గ్రామీణ ప్రాంతాల్లో ఉత్పత్తుల లభ్యత పెరగడం, ఆదాయాలు మెరుగుపడటం, నోటి ఆరోగ్యంపై అవగాహన పెరగడం వంటి కారణాలతో అమ్మకాల పరిమాణం పెరిగినట్లు కొల్గేట్ తెలిపింది. అయితే తక్కువ వర్షపాతం నేపథ్యంలో భవిష్యత్తులో గ్రామీణ డిమాండ్‌పై కంపెనీ ఎలాంటి స్పష్టమైన అంచనా వెల్లడించలేదు. మరోవైపు ‘పామోలివ్’ పర్సనల్ కేర్ బ్రాండ్ పనితీరుపై అసంతృప్తిగా ఉన్నట్లు ప్రభా నరసింహన్ తెలిపారు. డైరెక్ట్-టు-కన్స్యూమర్, ఈ-కామర్స్ విభాగాల్లో బ్రాండ్ ఉనికిని పెంచేందుకు బాంబే షేవింగ్ కంపెనీతో భాగస్వామ్యం చేసుకున్నట్లు వెల్లడించారు. మొత్తంగా పెరుగుతున్న ముడి పదార్థాల వ్యయాలు, ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల మధ్య ఎంపిక చేసిన ధరల పెంపు, ప్రీమియం ఉత్పత్తులపై దృష్టి, వాల్యూమ్ ఆధారిత వృద్ధి వ్యూహాలతో కొల్గేట్ ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
నేడే Apple Surprise and Shine Event.. ఫోల్డబుల్ iPhoneతో పాటు iPhone 18 Pro, కొత్త Apple Watchలు.. ఇంకా ఏం రాబోతున్నాయంటే?
-
Assam Murder Case: ఫ్రిజ్‌లో తల, వేళ్లు నరికిన భర్త.. పెంపుడు కుక్కకు మృతదేహాన్ని తినిపించే ప్లాన్?
-
IPL Team Owners: ఆస్ట్రేలియా క్రికెట్లో కీలక పరిణామం.. ఐపీఎల్ టీమ్ ఓనర్లకు పండగే ఇగ!
-
Shreyas Iyer: శ్రేయాస్ అయ్యర్‌కు షాక్.. వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు దూరం.. అసలు కారణం ఇదే!
-
Tata Nexonపై రూ.75,000 వరకు ఆఫర్.. స్క్రాపేజ్ బెనిఫిట్‌తో మరింత ఆదా.!
ట్రెండింగ్
-
కేవలం 6.39 మి.మీ. మందం, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో TECNO CAMON Slim 5G లాంచ్.!
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!