AAP: ఆప్‌కు బిగ్ షాక్.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్..
- ఢిల్లీ జల్ బోర్డు STP టెండర్ స్కామ్‌లో సత్యేంద్ర జైన్ అరెస్ట్.
- మాజీ DJB CEO ఉదిత్ ప్రకాష్ రాయ్ సహా మొత్తం ఆరుగురిని అరెస్ట్ చేసిన ఏసీబీ.
- ఒక ప్రైవేట్ కంపెనీకి లబ్ధి చేకూరేలా టెండర్ నిబంధనలు మార్చారని ఆరోపణలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AAP: ఢిల్లీ జల్ బోర్డ్ మురుగునీటి శుద్ధి కర్మాగారం (STP) టెండర్ కుంభకోణంలో ఢిల్లీ ప్రభుత్వ అవినీతి నిరోధక శాఖ (ACB) ఆప్ నేత, మాజీ జలవనరులు మంత్రి సత్యేంద్ర జైన్‌ను అరెస్ట్ చేసింది. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కు ఎదురుదెబ్బ తగిలింది. జైన్‌తో పాటు సీనియర్ ఐఏఎస్ అధికారి ఉదిత్ ప్రకాష్ రాయ్‌తో సహా మొత్తం ఆరుగురు నిందితులను ఏసీబీ అరెస్టు చేసింది. అరెస్టైన వారిలో ఉదిత్ ప్రకాష్ రాయ్ (ఢిల్లీ జల్ బోర్డ్ మాజీ సీఈఓ), అంకిత్ శ్రీవాస్తవ (డీజేబీ మాజీ కాంట్రాక్టు కన్సల్టెంట్), నాగేంద్ర యాదవ్ (ఏఎన్ ఎంటర్ప్రైజెస్ యజమాని), రాజా కుమార్ కుర్రా (యూరోటెక్ ఎన్విరాన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ యజమాని), పంకజ్ వర్మ (శ్రీజన్హర్ యజమాని) ఉన్నారు.
మురుగునీటి శుద్ధి ప్లాంట్ల ఆధునీకరణ, సామర్థ్య విస్తరణ కోసం జారీ చేసిన టెండర్లలో స్కామ్ జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. యూరో టెక్ ఎన్విరాన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి నేరుగా ప్రయోజనం చేకూర్చేందుకు టెండర్లో సాంకేతిక నిబంధనలు మార్చారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రతిపాదిత పైలట్ అధ్యయనాన్ని నిర్వహించకుండానే ఇతర కంపెనీల నుంచి పోటీని తొలగిస్తూ కొన్ని నిబంధనల్ని మార్చినట్లు తేలింది. దీంతో ప్రభుత్వ ఖజానాకు ఆర్థికనష్టం వాటిల్లినట్లు ఏసీసీ ఆరోపిస్తోంది.
Also Read
- Mumbai: ముంబైలో CJP నిరసనలు.. పోలీసుల అదుపులో అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్!
- Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
- BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
- Flydubai: ఫ్లై దుబాయ్ దర్యాప్తులోకి ఎన్ఐఏ.. యూఏపీఏ కింద కేసు నమోదు
దర్యాప్తులో ఏసీబీకి పలు ఎక్ట్రానిక్ ఆధారాలు లభించినట్లు తెలిసింది. ప్రైవేట్ వ్యక్తులు, మధ్యవర్తులు, ప్రభుత్వ అధికారుల మధ్య జరిగిన ఈమెయిల్స్, మెసేజ్‌లు పరిశీలించగా, టెండర్ పత్రాలు, సవరణ పత్రాలు ముందుగానే ఒకరితో ఒకరు పంచుకున్నట్లు గుర్తించినట్లు పేర్కొంది. ఆ తర్వాత మార్పులును ప్రభుత్వం టెండర్ పత్రాల్లో చేర్చినట్లు ఏసీబీ ఆరోపించింది. దీంతో అధికారుల, సంబంధిత కంపెనీ మధ్య కమ్ముక్కు జరిగిందనే అనుమానాలకు ఆధారాలు లభించినట్టు ఏసీబీ పేర్కొంది. అప్పటి DJB CEO ఉదిత్ ప్రకాష్ రాయ్‌కు సంబంధించిన వ్యక్తులు, ఆయన బంధువుల బ్యాంకు ఖాతాలకు ఏఎన్ ఎంటర్ప్రైజెస్ ద్వారా సుమారు రూ.1.52 కోట్లు బదిలీ అయ్యాయి. ఈ డబ్బును యూరోటెక్కు అనుబంధంగా ఉన్న సంస్థల ద్వారా మళ్లించి, ఆ తర్వాత ఆస్తుల కొనుగోలుకు ఉపయోగించారు. ఈ లంచం సొమ్ము లావాదేవీల మూలాలపై దర్యాప్తు జరుగుతోందని ఏసీబీ తెలిపింది.
తాజావార్తలు
-
Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
-
Mumbai: ముంబైలో CJP నిరసనలు.. పోలీసుల అదుపులో అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్!
-
Kona Venkat : ఆ డైరెక్టర్లను బ్యాన్ చేయాలి.. సంచలన కామెంట్లపై కోన వెంకట్ క్లారిటీ
-
Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
-
Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!