పుకార్లకు చెక్ పెట్టిన తలైవి

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘తలైవి’. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. ఏఎల్ విజయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం హిందీ తమిళం తెలుగు భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రంలో అరవింద స్వామి ఎఐఎడీఎంకే పార్టీ వ్యవస్థాపకుడు, ప్రముఖ దిగ్గజ నటుడు ఎంజీఆర్ గా కనిపించబోతున్నారు. ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ ఏప్రిల్ 23న విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా మహమ్మారి కారణంగా సినిమా విడుదల వాయిదా పడింది. ఈ సినిమా ఓటిటి ప్లాట్ ఫామ్ లో విడుదల చేయబోతున్నారు అని వార్తలు వచ్చాయి. అయితే కంగనా ఆ వార్తలని కొట్టిపారేసింది.

Read Also : ఆ కండల వెనుక యేడాది కష్టం!

తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరోసారి డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ అంటూ వస్తున్న వార్తలపై కంగనా క్లారిటీ ఇచ్చింది. తలైవి విడుదల తేదీని ఇంకా ఖరారు చేయలేదు. దయచేసి పుకార్ల దూరంగా ఉండండి. మేము దేశవ్యాప్తంగా థియేటర్లను ఓపెన్ చేసినప్పుడే ‘తలైవి’ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం అని ప్రకటించింది. ఇంతకుముందు పుకార్లపై స్పందించినప్పుడు ‘తలైవి’ తమిళ డిజిటల్ హక్కులని అమెజాన్, హిందీ హక్కులని నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుందని, అయితే ఈ రెండు ప్లాట్ ఫాంలలో కూడా అప్పుడే సినిమా మా స్ట్రీమింగ్ అవ్వదని, ముందుగా చిత్రం థియేటర్లోనే విడుదలవుతుందని స్పష్టం చేసింది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-