ట్రంప్-ఎలాన్ మస్క్ మరోసారి కలిసి ప్రత్యక్షమయ్యారు. ఫ్లోరిడాలోని అధ్యక్షుడికి చెందిన మార్-ఎ-లాగో రిసార్ట్‌లో శనివారం సాయంత్రం జరిగిన ఒక ప్రత్యేక విందుకు ఎలాన్ మస్క్ హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: Nirmala Sitharaman Budget: ఈసారి బడ్జెట్ ఎప్పుడు?.. సాంప్రదాయానికి భిన్నమేనా..!
అధ్యక్ష ఎన్నికల ముందు ట్రంప్-మస్క్ కలిసి పని చేశారు. అయితే ట్రంప్ అధికారంలోకి వచ్చాక బిగ్ బ్యూటీఫుల్ బిల్లు తీసుకొచ్చారు. ఈ బిల్లును మస్క్ తీవ్రంగా వ్యతిరేకించారు. సోషల్ మీడియా వేదికగా మస్క్ విమర్శలు గుప్పించారు. దీంతో ట్రంప్‌తో మస్క్ స్నేహం చెడింది. నెలల తరబడి ఇద్దరి మధ్య వివాదం కొనసాగింది.
ఇది కూడా చదవండి: Trump-Iran: ఇంకా ఎవరైనా చనిపోతే ఖబడ్దార్.. ఖమేనీకి ట్రంప్ గట్టి వార్నింగ్
అయితే గత సెప్టెంబర్ 10న ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్యకు గురయ్యారు. ఆయన సంస్మరణ కార్యక్రమంలో ట్రంప్-మస్క్ పక్కపక్కనే కూర్చుని షేక్‌హ్యాండ్‌లు ఇచ్చుకున్నారు. అనంతరం నవంబర్‌లో సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్‌కు వైట్‌హౌస్‌లో ట్రంప్ ప్రత్యేక విందు ఇచ్చారు. ఈ ఆతిథ్యానికి మస్క్ హాజరయ్యారు. తాజాగా మరోసారి విందులో కలవడంతో ఇద్దరి మధ్య స్నేహం మళ్లీ చిగురిస్తున్నట్లుగా కనిపిస్తోంది.
Had a lovely dinner last night with @POTUS and @FLOTUS.
2026 is going to be amazing! pic.twitter.com/1Oq35b1PEC
— Elon Musk (@elonmusk) January 4, 2026