Elon Musk: టెస్లా, స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ సరికొత్త రికార్డ్ సృష్టించాడు. వ్యక్తిగత సంపాదనలో తొలిసారిగా 400 బిలియన్ డాలర్ల క్లబ్ లోకి దూసుకుపోయాడు. ప్రపంచంలో ఇప్పటి వరకు ఇంత సంపాదించిన వ్యక్తి ఇంకొకరు లేరు. తాజాగా స్పేస్ ఎక్స్ లోని అంతర్గత వాటా విక్రయించడంతో ఆయన సంపాదన దాదాపు 50 బిలియన్ డాలర్లు పెరగడంతో 439.2 బిలియన్ డాలర్లకు చేరిందని బ్లూమ్ బర్గ్ బిలియనీర్స్ సూచీ ప్రకటించింది. అయితే, 2022 చివరలో మస్క్ సంపాదన 200 బిలియన్ డాలర్ల కంటే కిందికి పడిపోయింది. కానీ, ఇటీవల అమెరికా ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన సంపాదన రాకెట్ లాగా దూసుకుపోతుంది. డొనాల్డ్ ట్రంప్ విజయంతో టెస్లా స్టాక్స్ దాదాపు 65 శాతం పెరిగిపోయాయి.
Read Also: Donald Trump: నా ప్రమాణస్వీకారానికి రండి.. చైనా అధ్యక్షుడికి ట్రంప్ ఆహ్వానం!
అయితే, ఎలాన్ మస్క్ సంపాదన రోజురోజుకు పెరగడంతో.. ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీకి అత్యధిక విరాళాలు ఇచ్చాడు. అలాగే, ట్రంప్ విజయంలో కీ రోల్ పోషించారు. దాంతో ట్రంప్ తన మంత్రివర్గంలో మస్క్ కు కీలక పదవిని కట్టబెట్టాడు. ఇక, అధ్యక్షుడిగా గెలిచిన ట్రంప్.. సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను క్రమబద్ధీకరిస్తారని, టెస్లా పోటీదారులకు మేలు చేసే ఎలక్ట్రిక్ వెహికిల్స్ పై టాక్స్ క్రెడిట్ లను తొలగిస్తారని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయని బ్లూమ్ బర్గ్ బిలియనీర్స్ సూచీ పేర్కొంది.
Read Also: School Holidays: ఏపీలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలో స్కూళ్లు, కాలేజీలకు సెలవు
కాగా, మస్క్ కు చెందిన ఆర్టిఫిషియల్ స్టార్టప్ ఎక్స్ ఏఐ గత మే నెల నుంచి నిధుల సేకరణ స్టార్ట్ చేసింది. దాని విలువ కూడా 50 బిలియన్ డాలర్లకు చేరిపోయింది. ఇక బుధవారం స్పేస్ ఎక్స్, దాని పెట్టుబడిదారులు ఒక ఒప్పందం చేసుకున్నారు. దాంతో 1.25 బిలియన్ డాలర్ల విలువ గల షేర్లను స్పేస్ ఎక్స్ ఉద్యోగులు, కంపెనీ ఇన్ సైడర్ల దగ్గర నుంచి కొనుగోలు చేసేందుకు ఒప్పండం చేసుకోవడంతో.. స్పేస్ ఎక్స్ 350 బిలియన్ డాలర్ల విలువకు చేరి వరల్డ్ లోనే అత్యంత విలువైన ప్రైవేట్ స్టార్టప్ గా చరిత్ర సృష్టించింది. ఇక, స్పేస్ ఎక్స్ ఆదాయంలో ఎక్కువ శాతం అమెరికా సర్కార్ ఒడంబడికల మీదనే ఆధారపడింది. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ పదవీకాలంలో కంపెనీకి భారీ సపోర్టు దొరికే అవకాశం ఉంది.