Donald Trump: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించారు డొనాల్డ్ ట్రంప్. ఈ క్రమంలో ఆయన మరి కొన్ని రోజుల్లో పదవీ బాధ్యతలను స్వీకరించనున్నారు. ఇక, ఈ బాధ్యత స్వీకరణ కార్యక్రమానికి చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు ఆహ్వానం పంపినట్లు సమాచారం. ఈ మేరకు పలు అంతర్జాతీయ మీడియాల్లో వార్తలు ప్రసారం చేశారు. జనవరి 20వ తేదీన ట్రంప్ యూఎస్ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని జిన్‌పింగ్‌కు ఆహ్వానం పలికినట్లు టాక్. అయితే, ఈ ఆహ్వానంపై వాషింగ్టన్‌లోని చైనా రాయబార కార్యాలయం ఇప్పటి వరకు స్పందించలేదు. మరోవైపు, ఇటీవల ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చైనా అధ్యక్షుడితో తనకు మంచి రిలేషన్స్ ఉన్నాయి.. ఈ మధ్యే తాము మాట్లాడుకున్నామని డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు.
Read Also: Supreme Court: విడాకుల భరణం నిర్ణయించడానికి 8 మార్గదర్శకాలను జారీ చేసిన సుప్రీంకోర్టు
కాగా, తాను అధ్యక్షుడిగా అధికార బాధ్యతలు చేపట్టాక చైనా దిగుమతులపై 10 శాతం పన్నులు విధించనున్నట్లు డొనాల్డ్ ట్రంప్ గతంలో పలుమార్లు వ్యాఖ్యనించారు. దీనిపై డ్రాగన్ కంట్రీ అధినేత జిన్‌పింగ్ ఘాటుగా స్పందించారు. చైనా- అమెరికా మధ్య టారిఫ్, టెక్ యుద్ధాల్లో విజేతలు ఉండరని కామెంట్స్ చేశారు. తమ దేశ ప్రయోజనాలను పరిరక్షించుకుంటాని తేల్చి చెప్పారు. అయితే, అమెరికాకు కాబోయే అధ్యక్షుడు ట్రంప్ ను ఏటా టైమ్ మ్యాగజైన్ ఇచ్చే ‘పర్సన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుకు ఎన్నికయినట్లు సమాచారం. ఈ మేరకు పలు మీడియాల్లో ప్రచారం జరిగింది. దీనిపై టైమ్ మ్యాగజైన్ కూడా రియాక్ట్ కాలేదు. 2016లో ఒకసారి డొనాల్డ్ ట్రంప్ ‘పర్సన్ ఆఫ్‌ది ఇయర్’గా ఎంపికయ్యారు. ఆ తర్వాత 2019 అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌లు ఈ అవార్డ్ కైవసం చేసుకున్నారు. గతేడాది ఈ టైటిల్‌ను పాప్ స్టార్ టేలర్ స్విఫ్ట్ దక్కించుకున్నారు.