టోక్యో ఒలింపిక్స్‌లో కరోనా కలవరం పెడుతుంది. ఒలింపిక్స్ నిర్వహించే విలేజ్‌లో కరోనా పాజిటివ్ వ్యక్తుల సంఖ్య పెరుగుతుంది. తాజాగా మరో ఇద్దరికి పాజిటివ్ నిర్థారణ అయ్యింది. స్క్రీనింగ్ టెస్ట్‌లో మరో ఇద్దరు అథ్లెట్లకు కరోనా సోకింది. ఒలింపిక్ విలేజ్‌లో మొన్న తొలి కేసు నమోదయ్యింది. ఇకపై ప్రతిరోజు క్రీడాకారులకు కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించనున్నారు.
read also : పార్లమెంట్ సమావేశాలు : ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
ఈ నెల 23 నుంచి ఒలింపిక్స్ ప్రారంభమవుతండటంతో తాజా పరిస్థితో కలవరం మొదలయ్యింది. ఇది ఇలా ఉండగా…. ఒలింపిక్స్ క్రీడల నిర్వహణ కోసం జపాన్ సర్వం సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలో క్రీడాగ్రామంలో అథ్లెట్ల కోసం ఏర్పాటు చేసిన మంచాలు ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.