అంతరిక్షంలో ప్రయాణించే వ్యోమగాములకు, అంతరిక్ష కేంద్రంలో ఉండే వ్యోమగాముల శరీరాలపై మైక్రో గ్రావిటీ తీవ్ర ప్రభావం చూపిస్తుందని తాజా అధ్యయనం వెల్లడించింది. అంతరిక్ష కేంద్రంలో ప్రయాణించిన 17 మంది వ్యోమగాములపై చేసిన అధ్యయనం వారిలో ఎముకల సాంద్రత తగ్గుతున్నట్లు గమనించింది. అయితే అంతరిక్షంలో ఉన్న సమయంలో ఎముకల సాంద్రత తగ్గినా.. భూమి మీదకు వచ్చిన కొన్ని రోజుల్లోనే మళ్లీ బోన్ డెన్సిటీ పెరుగుతుందని ఇన్నాళ్లు అనుకున్నారు. కానీ వ్యోమగాముల్లో మోకాలు కింది ప్రాంతం టిబియా ఎముక వద్ద…