Bangladesh: పాకిస్తాన్‌తో 1971 సమస్యల పరిష్కారానికి బంగ్లాదేశ్ సిద్ధం..
- బంగ్లాదేశ్‌తో సంబంధాలకు పాకిస్తాన్ ఆరాటం..
- విద్యార్థి నేత.. మంత్రి నహీద్ ఇస్లాంతో పాక్ రాయబారి వరస భేటీలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: బంగ్లాదేశ్ నెమ్మనెమ్మదిగా పాకిస్తాన్‌కి దగ్గర అవుతోంది. ఏ దేశం నుంచి తమకు స్వాతంత్య్రం కావాలని పోరాడిందో, ప్రస్తుతం షేక్ హసీనా దిగిపోయిన తర్వాత ఆ దేశానికి దగ్గర కావడానికి ప్రయత్నిస్తోంది. తాజాగా షేక్ హసీనాను గద్దె దించడంతో కీలక పాత్ర పోషించిన విద్యార్థి నేత, ప్రస్తుతం బంగ్లా తాత్కాలిక ఐటీ మంత్రిగా ఉన్న నహిద్ ఇస్లాం పాకిస్తాన్ రాయబార అధికారులతో భేటీ అవుతున్నాడు. రెండు దేశాల మధ్య సంబంధాలు బలోపేతం కావాలని కోరుకుంటున్నట్లు అతను పేర్కొన్నాడు. పాకిస్తాన్‌తో 1971 విముక్తి యుద్ధ సమస్యలను పరిష్కరించుకోవడానికి, ప్రజాస్వామ్య సంబంధాల బలోపేతాన్ని బంగ్లాదేశ్ కోరుకుంటోందని నహీద్ ఇస్లాం చెప్పారు.
Read Also: Bangladesh: పాకిస్తాన్ నుంచి భారీగా ఆయుధాలు కొంటున్న బంగ్లాదేశ్.. ఇండియానే లక్ష్యమా..?
Also Read
- Iran: పాక్, టర్కీతో ఒప్పందాలు రక్షించలేవు.. సౌదీకి ఇరాన్ వార్నింగ్..
- Trump: యుద్ధంపై ట్రంప్ మరోసారి కీలక ప్రకటన.. ఇరాన్ రియాక్షన్ ఇదే!
- Bangladesh: బంగ్లాదేశ్‌లో సంచలనం.. అవామీలీగ్ విలీనానికి BNP ఎంపీ పిలుపు
- Sheikh Hasina: షేక్ హసీనా వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు.. బంగ్లాదేశ్‌కు స్పష్టం చేసిన భారత్..
హసీనా హయాంలో బంగ్లా, పాక్‌ల మధ్య సంబంధాలు అంతంత మాత్రంగా ఉండేవి, ప్రత్యేకించి 1971 యుద్ధ సమయంలో పాక్‌కి సహకరించిన జమాతే ఇస్లామీకి చెందిన నాయకులపై యుద్ధ నేరాలు పెట్టారు. ఢాకాలో పాకిస్తాన్ హైకమిషనర్ సయ్యద్ అహ్మద్ మరూఫ్‌తో వరస సమావేశాల తర్వాత నహీద్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. సెప్టెంబర్ 01న జరిగిన సమావేశం తర్వాత పాక్‌తో సంబంధాలను నహీద్ ఇస్లాం కాంక్షించారు. మరోవైపు, గత ప్రభుత్వం చర్చించడానికి మాకు అవకాశం ఇవ్వలేదని, 1971 సమస్యని సజీవంగా ఉంచిందని పాక్ రాయబారి అన్నారు. బంగ్లాతో సంబంధాలు ఏర్పాటు చేసుకోవడానికి పాక్ ఆసక్తి చూపుతోందని అన్నారు.
1971 బంగ్లాదేశ్ చరిత్రలో ఒక ముఖ్య సమస్య అని నహీద్ ఇస్లాం అన్నాడు. అవామీ లీగ్ ప్రకారం.. 1971 చరిత్ర యొక్క చివరి అధ్యాయం, కానీ ఇది చరిత్రకు కొనసాగింపుగా మేము భావిస్తున్నామని చెప్పాడు. 1971 బంగ్లా విముక్తి పోరాటంతో పాక్‌లో భాగంగా ఉన్న పశ్చిమ పాకిస్తాన్(ఇప్పటి బంగ్లాదేశ్)పై పాక్ ఆర్మీ అకృత్యాలకు పాల్పడింది. 30 లక్షల మరణాలు సంభవించాయి. ఈ దురాగతాలకు బంగ్లా పాక్ నుంచి క్షమాపణలు కోరింది. అయితే గత 53 ఏళ్లుగా ఈ రెండు దేశాల సంబంధాల్లో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ, ఇప్పటికే సమస్యపై ఎలాంటి పరిష్కారం రాలేదు.
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్‌కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్‌ఫ్లిక్స్‌లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!