Sheikh Hasina: షేక్ హసీనా వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు.. బంగ్లాదేశ్‌కు స్పష్టం చేసిన భారత్..
- షేక్ హసీనా వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు..
- బంగ్లాదేశ్‌కు తేల్చి చెప్పిన భారత్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ఆగస్టు 5న నిర్వహించిన మీడియా సమావేశం, ఆ దేశంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. తాను తిరిగి బంగ్లాదేశ్ వెళ్లబోతున్నట్లు ప్రకటించడంతో పాటు మహ్మద్ యూనస్ పాలన, తనను పదవి నుంచి కిందకు దించడంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, న్యూఢిల్లీ నుంచి హసీనా చేసిన ఈ ప్రసంగంపై బంగ్లాదేశ్ తీవ్ర అభ్యంతరం తెలుపుతోంది. ఈ అంశం రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలను ప్రభావితం చేస్తుందని బంగ్లా వ్యాఖ్యానించింది.
ఇదిలా ఉంటే, ఈ వ్యవహారంపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది. షేక్ హసీనా మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలకు భారత ప్రభుత్వంతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఆ వ్యాఖ్యల్ని భారత్ సమర్థించడం లేదని తెలిపింది. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ, షేక్ హసీనా పాల్గొన్న కార్యక్రమం పూర్తిగా ఒక ప్రైవేట్ మీడియా సంస్థ నిర్వహించిందని చెప్పారు.
Also Read
- Central Government Schemes: రైతులకు 3 అద్భుత కేంద్ర పథకాలు.. ఏటా రూ.6,000.. నెలకు రూ.3,000 పెన్షన్..!
- Amritsar ASI Harjit Singh: ASI హర్జీత్ సింగ్ హత్య కేసులో కీలక పరిణామం.. పోలీస్ ఎన్కౌంటర్లో నిందితుడు మృతి
- Saurav Gurjar: పెళ్లి పేరుతో మోసం.. ప్రముఖ నటుడు, రెజ్లర్ సౌరవ్ గుజ్జార్ అరెస్ట్..
- El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
2024 ఆగస్టులో హింసాత్మక నిరసనల తర్వాత హసీనా బంగ్లా నుంచి భారత్ వచ్చి ఆశ్రయం పొందుతున్నారు. ఈ ఏడాది చివర్లో తాను తన సొంత దేశానికి వెళ్తున్నట్లు ప్రకటించారు. జైలు శిక్ష లేదా మరణశిక్ష ఎదురైనా ప్రజల కోసం స్వదేశానికి వెళ్తానని ఆమె చెప్పారు. తన లక్ష్యం మళ్లీ అధికారంలోకి రావడం కాదని, బంగ్లాదేశ్‌లో ప్రజాస్వామ్యం, లౌకికవాదం, అభివృద్ధి పునరుద్ధరించడమే అని చెప్పారు. అవామీలీగ్‌పై నిషేధం ఎత్తాయాలని, రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని, తప్పుడు కేసులను విత్ డ్రా చేసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. మహ్మద్ యూనస్ పాలనలో బంగ్లా పరిస్థితి మరో పాకిస్తాన్లా మారిందని హసీనా కుమారుడు అన్నారు. తనకు వ్యతిరేకంగా జరిగిన విద్యార్థి ఉద్యమం ఒక కుట్ర అని, పాలన మార్చాలని కుట్ర పన్నారని హసీనా ఆరోపించారు.
తాజావార్తలు
-
CM Chandrababu: తీవ్ర తాగునీటి సంక్షోభం.. వచ్చే ఏడాది నుంచి శాశ్వత పరిష్కారం.!
-
Central Government Schemes: రైతులకు 3 అద్భుత కేంద్ర పథకాలు.. ఏటా రూ.6,000.. నెలకు రూ.3,000 పెన్షన్..!
-
Salman Khan: కత్రినా బాడీ షేమింగ్‌పై సల్మాన్ ఫైర్.. కెమెరా ముందే షర్ట్ విప్పి ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ వార్నింగ్!
-
Ramayana : రామాయణ ఇంగ్లీష్ వర్షన్లో మార్పులు.. పాటలు, కొన్ని సీన్స్‌కు కటింగ్ వేస్తోన్న టీం
-
Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. హిట్ అండ్ రన్లో మూడేళ్ల బాలుడు మృతి
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!