Operation Sindoor: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్‌లో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు 26 మంది టూరిస్టుల్ని హతమార్చారు. దీనికి ప్రతిగా భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ పేరుతో పాకిస్తాన్‌పై దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో జైషే మహ్మద్, లష్కరే తోయిబాకు చెందిన ప్రధాన కార్యాలయాలపై భీకరదాడులు చేసింది.
Rajnath Singh: పాకిస్తాన్‌కు భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఆపరేషన్ సిందూర్ కేవలం ట్రైలర్ మాత్రమే అని శనివారం తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఈ ఆపరేషన్ ద్వారా భారతదేశానికి విజయం ఒక అలవాటుగా మారిందని నిరూపణ అయిందని ఆయన అన్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌లో కలిసి రాజ్‌నాథ్ సింగ్ లక్నోలోని బ్రహ్మోస్ ఏరోస్పేస్ యూనిట్‌లో తయారైన బ్రహ్మోస్ క్షిపణుల మొదటి బ్యాచ్‌ను జెండా ఊపి ప్రారంభించారు. Read Also: Shubman Gill:…
BrahMos: స్వదేశీ టెక్నాలజీ, ఆత్మ నిర్భర భారత్‌లో కీలక మైలురాయికి చేరుకుంది. కొత్తగా లక్నోలో ప్రారంభించిన ఫెసిలిటీతో తయారైన ‘‘బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్షిపణి’’ మొదటి బ్యాచ్ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో జరగబోయే వేడుకలకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌లు హాజరుకానున్నారు.
Russia: పాకిస్తాన్ తయారీ ఫైటర్ జెట్ JF-17 కోసం రష్యా ఇంజన్లు ఇస్తోందనే ప్రచారం ఇటీవల జోరుగా సాగింది. దీనిపై ప్రతిపక్ష కాంగ్రెస్, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసింది. మోడీ దౌత్య విధానం విఫలమైందని ఆరోపించింది. అయితే, ఈ ఊహాగానాలను రష్యా ఖండించింది. నిజానికి, JF-17 యుద్ధ విమానం కోసం పాకిస్తాన్‌కు RD-93 ఇంజిన్‌లను సరఫరా చేయడం వల్ల వాస్తవానికి భారతదేశానికి ప్రయోజనం చేకూరుతుందని రష్యన్ రక్షణ నిపుణులు చెబుతున్నారు.
Operation Sindoor: పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’తో బదులు తీర్చుకుంది. అయితే, భారత్ ఉగ్రవాద స్థావరాలపై మాత్రమే దాడి చేసినా, పాక్ ఆర్మీ కవ్వించిన సంగతి తెలిసిందే. పాక్ ఆర్మీ భారత జనావాసాలు, సైనిక స్థలాలను టార్గెట్ చేస్తూ, డ్రోన్లతో దాడులు నిర్వహించింది.
పాకిస్థాన్ సరిహద్దు రాష్ట్రాలలో గురువారం సాయంత్రం మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. ఈ మాక్ డ్రిల్ గుజరాత్, పంజాబ్, రాజస్థాన్, జమ్మూ కశ్మీర్‌లలో జరుగుతుంది. పాకిస్థాన్ సరిహద్దులో ఉన్న ఈ నాలుగు రాష్ట్రాలలో ప్రభుత్వం మాక్ డ్రిల్‌లను ఆదేశించింది. దీంతో భారత సైన్యం ఏదైనా కీలక నిర్ణయం తీసుకుంటుందా?
Bangladesh: బంగ్లాదేశ్ నెమ్మనెమ్మదిగా పాకిస్తాన్‌కి దగ్గర అవుతోంది. ఏ దేశం నుంచి తమకు స్వాతంత్య్రం కావాలని పోరాడింతో, ప్రస్తుతం షేక్ హసీనా దిగిపోయిన తర్వాత ఆ దేశానికి దగ్గర కావడానికి ప్రయత్నిస్తోంది. తాజాగా షేక్ హసీనాను గద్దె దించడంతో కీలక పాత్ర పోషించిన విద్యార్థి నేత, ప్రస్తుతం బంగ్లా తాత్కాలిక ఐటీ మంత్రిగా ఉన్న నహిద్ ఇస్లాం పాకిస్తాన్ రాయబార అధికారులతో భేటీ అవుతున్నాడు.
Bangladesh: రిజర్వేషన్ కోటాని వ్యతిరేకిస్తూ బంగ్లాదేశ్ హింసాత్మక అల్లర్ల నేపథ్యంలో ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేసి భారత్ పారిపోయి రావాల్సి వచ్చింది. అయితే, ప్రస్తుతం బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా మహ్మద్ యూనస్ ఉన్నారు. షేక్ హసీనా దిగిపోయిన తర్వాత లౌకిక దేశంగా ఉన్న బంగ్లా నెమ్మదిగా ఇస్లామిక్ రాడికల్ పాలన దిశగా వెళ్తోంది. ఇందుకు అక్కడ హిందువులపై జరుగుతున్న దాడులు, హత్యలు ఈ ఆరోపణల్ని బలపరుస్తున్నాయి.