Amazon Plans To Sack 20,000 Employees: ఆర్థిక మందగమనం, ఆర్థిక మాంద్యం పరిస్థితులు, ద్రవ్యోల్భణం భయాల మధ్య పలు టెక్ కంపెనీలు వరసగా తమ ఉద్యోగులను తీసేస్తున్నాయి. ట్విట్టర్ లో మొదలైన ఈ తొలగింపులు వరసగా కొనసాగుతున్నాయి. మైక్రోసాప్ట్, గూగుల్, అమెజాన్ ఇలా ప్రముఖ టెక్ దిగ్గజాలు అన్నీ కూడా తమ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించాయి. లాభాలు తగ్గడంతో ఖర్చులు తగ్గించే ప్రయత్నంలో భాగంగా ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి.
Read Also: Tamil Nadu: ఉదయనిధి స్టాలిన్ “ప్లేబాయ్”గానే మిగిలిపోతాడు.. బీజేపీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
ఇదిలా ఉంటే రాబోయే కొన్ని నెల్లలో అమెజాన్ కంపెనీ తన కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌లతో సహా దాదాపు 20,000 మంది ఉద్యోగులను తొలగించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 1.6 మిలియన్లకు పైగా ఉద్యోగాలు ఉన్న టెక్ దిగ్గజం తన ఉద్యోగులను తొలగించనుంది. ఈ తొలగింపు అన్ని స్థాయిల్లోని ఉద్యోగులపై ప్రభావం చూపుతుందని తెలుస్తోంది. ఇప్పటికే ఉద్యోగుల పనితీరును మదింపు చేయాలని మేనేజర్లు ఆదేశాలు ఇచ్చింది. గత నెలలో న్యూయార్క్ టైమ్స్.. అమెజాన్ 10,000 ఉద్యోగులను తొలగిస్తుందని నివేదించింది. ఉద్యోగులను తొలగించే ముందు 24 గంటల ముందు నోటీసుతో పాటు కంపెనీ కాంట్రాక్ట్ ప్రకారం చెల్లింపులు ఉంటాయని తెలుస్తోంది.
మరో ఆరు నెలల నుంచి ఏడాది కాలంలో ప్రపంచ మాంద్యం వస్తుందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు.దీంతో టెక్ కంపెనీలు తమ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇప్పటికే ట్విట్టర్ తన కంపెనీలో 50 శాతం అంటే దాదాపుగా 3800 మందిని, ఫేస్ బుక్ మాతృసంస్థ మెటా 13 శాతం అంటే 13,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఇక గూగుల్ 10,000 మందిని తొలగిస్తున్నట్లు వెల్లడించింది. ఇదే బాటలో అమెజాన్ కూడా పయణిస్తోంది. ఇదిలా ఉంటే నెట్ ఫ్లిక్స్, డిస్నీ వంటివి కూడా తమ ఉద్యోగులను తొలగించే ఆలోచనలో ఉన్నాయి.