Amazon Begins Mass Layoffs: టెక్ దిగ్గజాలు వరసగా తమ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇప్పటికే ట్విట్టర్, నెట్ ఫ్లిక్స్, మెటా వంటి కంపెనీలు తమ ఉద్యోగులను తొలగింపును ప్రారంభించాయి. తాజాగా అమెజాన్ కూడా ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను ప్రారంభించినట్లు యూఎస్ మీడియా నివేదికలు బుధవారం వెల్లడించాయి. చాలా సమీక్షల తర్వాత మేము ఇకపై కొందరి అవసరం ఉండదని హార్డ్‌వేర్ చీఫ్ డేవ్ లింప్ బుధవారం ఉద్యోగులకు ఇచ్చిన మెమోలోమ పేర్కొన్నారు. ప్రతిభావంతులైన ఉద్యోగులను కోల్పోతామని మాకు తెలుసు…