France: ఫ్రాన్స్‌లో హై అలర్ట్ నెలకొంది. దాడులు జరుగుతాయనే బెదిరింపుల నేపథ్యంలో ప్రభుత్వం అలర్టైంది. పారిస్ సమీపంలోని 6 ఎయిర్ పోర్టులను అధికారులు ఖాళీ చేయించారు. లిల్లే, లియోన్, నాంటెస్, నైస్, టౌలౌస్, బ్యూవైస్ విమానాశ్రయాలను అత్యవసరంగా ఖాళీ చేయించారు. బుధవారం ఈమెయిల్ ద్వారా దాడి జరుగుతుందని ఓ అగాంతకుడు బెదిరింపులకు పాల్పడ్డారు.