Hamas War: హమాస్ యుద్ధంలో ఇజ్రాయిల్ విరుచుకుపడుతోంది. తమ లక్ష్యాలు నెరవేరే దాకా యుద్ధాన్ని ఆపేది లేదని, ఎంత ఒత్తిడి ఎదురైనా కూడా యుద్ధాన్ని కొనసాగిస్తామని ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ఇటీవల చెప్పారు. దానికి అనుగుణంగానే ఇజ్రాయిల, గాజస్ట్రిప్‌పై విరుచుకుపడుతోంది. దీంతో పాటు వెస్ట్ బ్యాంకులో కూడా దాడులు నిర్వహిస్తోంది.
Israel-Hamas War: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం ఇప్పట్లో నిలిచేలా కనిపించడం లేదు. అక్టోబర్ 7న ఇజ్రాయిల్ భూభాగంలోకి చొరబడి 1400 మందిని హమాస్ ఉగ్రవాదులు ఊచకోత కోశారు. దీని తర్వాత నుంచి గాజాస్ట్రిప్ పై ఇజ్రాయిల్ భీకర దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటి వరకు పలువురు ఉగ్రవాదులతో సహా 9000 మంది పాలస్తీనియన్లు మరణించారు. ఇదిలా ఉంటే మరోవైపు ఇజ్రాయిల్ తో పోరుకు హిజ్బుల్లా, హౌతీ మిలిటెంట్లు కాలుదువ్వుతున్నారు.
Sponge Bombs: గాజా స్ట్రిప్‌లో ఉన్న హమాస్ ఉగ్రవాదుల సొరంగాలను మూసివేయడానికి ఇజ్రాయెల్ కొత్త ఆయుధాన్ని కనుగొంది. ఇదొక ప్రత్యేక బాంబు. ఇది పేలదు. కానీ ఎక్కడ పడితే అక్కడ చాలా నురుగు వస్తుంది.
Joe Biden: గత 20 రోజులుగా ఇజ్రాయిల్-హమాస్ మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. అక్టోబర్ 7న ఇజ్రాయిల్ భూభాగంలోకి చొరబడిని హమాస్ ఉగ్రవాదాలు దారుణమైన ఊచకోతకు పాల్పడ్దారు. అప్పటి నుంచి ఇజ్రాయిల్ గాజాపై వైమానికి దాడులు నిర్వహిస్తోంది. అయితే పటిష్టమైన నిఘా వ్యవస్థ, మొస్సాద్ వంటి వ్యవస్థలు ఉన్నా కూడా ఇజ్రాయిల్, పొరుగున పాలస్తీనా గాజా నుంచి ఎదురయ్యే దాడిని కనిపెట్టలేకపోయింది.
PM Modi: పశ్చిమాసియా, మధ్యప్రాచ్యంలో ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం తీవ్ర ఉద్రిక్తతలను పెంచుతోంది. అక్టోబర్ 7న హమాస్, ఇజ్రాయిల్‌పై దాడితో యుద్ధం మొదలైంది. ఇదిలా ఉంటే తాజాగా ప్రధాని నరేంద్రమోడీ, పాలస్తీనా అథారిటీ అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్‌తో మాట్లాడారు.
France: ఫ్రాన్స్‌లో హై అలర్ట్ నెలకొంది. దాడులు జరుగుతాయనే బెదిరింపుల నేపథ్యంలో ప్రభుత్వం అలర్టైంది. పారిస్ సమీపంలోని 6 ఎయిర్ పోర్టులను అధికారులు ఖాళీ చేయించారు. లిల్లే, లియోన్, నాంటెస్, నైస్, టౌలౌస్, బ్యూవైస్ విమానాశ్రయాలను అత్యవసరంగా ఖాళీ చేయించారు. బుధవారం ఈమెయిల్ ద్వారా దాడి జరుగుతుందని ఓ అగాంతకుడు బెదిరింపులకు పాల్పడ్డారు.