Israel-Hamas War: దక్షిణ గాజాపై ఇజ్రాయిల్ దాడుల్లో 32 మంది మృతి.. అల్ షిఫా నుంచి పారిపోతున్న రోగులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel-Hamas War: ఇన్నాళ్లు ఉత్తర గాజా ప్రాంతాన్ని మాత్రమే టార్గెట్ చేసిన ఇజ్రాయిల్ ఆర్మీ, ఇప్పుడు హమాస్‌ని పూర్తిగా నిర్మూలించడానికి దక్షిణ గాజాపై కూడా ఫోకస్ చేసింది. దక్షిణ గాజా లక్ష్యంగా ఇజ్రాయిల్ వైమానిక దళం దాడులు చేసింది. శనివారం జరిగిన ఈ దాడుల్లో 32 మంది పాలస్తీనియన్లు చనిపోయారు. గతంలో ఉత్తరగాజాను ఖాళీ చేయాలని ఇజ్రాయిల్ గాజా ప్రజలను హెచ్చరించింది. లక్షలాది మంది ప్రాణాలు చేత పట్టుకుని దక్షిణ ప్రాంతానికి వెళ్లారు. అయితే ఇప్పడు దక్షిణ గాజాపై కూడా దాడులు మొదలయ్యాయి. 4 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న ఖాన్ యూనిస్ లోని ప్రజల పరిస్థితి, మానవతా సంక్షోభం మరింత దిగజారే అవకాశం ఉంది. ‘‘మేము ప్రజల్ని వేరే ప్రాంతాలకు వెళ్లాలని కోరాము, వారిలో చాలా మందికి అది సులభం కానది తెలుసు. కానీ ఎదురుకాల్పుల్లో ప్రజలు చిక్కుకోవడం చూడకూడదని అనుకుంటున్నాము’’ అని ఇజ్రాయిల్ పీఎం బెంజిమిన్ నెతన్యాహు సహాయకుడు మార్క్ రెగెవ్ శుక్రవారం అన్నారు.
Read Also: World Cup 2023: ఆనాటి విధ్వంసకర ఇన్నింగ్స్‌ని గుర్తుచేసుకున్న రికీ పాంటింగ్..
Also Read
- Nobel Prize Economics : అర్థశాస్త్ర నోబెల్‌పై ఆసక్తి.. విజేతలుగా ఇద్దరు ప్రముఖులు..
- Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
- Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
- Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
గాజా స్ట్రిప్‌లోని 23 లక్షల జనాభాలో సగం మంది ఇప్పటికే వేరే ప్రాంతాలకు తరలివెళ్లారు. ముఖ్యంగా హమాస్ కు పట్టు ఉన్న గాజా నగరంలో పాటు ఉత్తరగాజాపై ఇజ్రాయిల్ బలగాలు విరుచుకుపడుతున్నాయి. కీలక హమాస్ కమాండర్లను, వారి స్థావరాలను మట్టుబెడుతున్నాయి. ఇప్పటి వరకు ఇజ్రాయిల్ జరిపిన దాడుల్లో 12 వేల మంది పాలస్తీనియన్లు మరణించారు. ఇందులో 5 వేల మంది పిల్లలు ఉన్నట్లు ఐక్యరాజ్యసమితి గణాంకాలు చెబుతున్నాయి.
ఇదిలా ఉంటే గాజాలోని ఆస్పత్రులను హమాస్ కమాండ్ సెంటర్లుగా, షెల్టర్లుగా, ఆయుధ కేంద్రాలుగా ఉపయోగించుకుంటున్నట్లు ఇజ్రాయిల్ బహిర్గతం చేసింది. దీంతో గాజా నగరంలోని అతిపెద్ద ఆస్పత్రి అయిన అల్ షిఫా ఆస్పత్రిని టార్గెట్ చేసింది. ఈ ఆస్పత్రి కంప్యూటర్లలో బందీలకు సంబంధించిన ఫుటేజ్ లభించింది. దీంతో పాటు ఆస్పత్రి కింద సొరంగాలను ఇజ్రాయిల్ ఆర్మీ కనుగొంది. యుద్ధం తీవ్రరూపం దాలుస్తున్న తరుణంలో అల్ షిఫా ఆస్పత్రిలోని రోగులు బయటకు వెళ్తున్నారు. శనివారం ఇజ్రాయిల్ సైన్యం ఆస్పత్రిని ఖాళీ చేయమని చెప్పిందని ఆస్పత్రి డైరెక్టర్ చెప్పిన నేపథ్యంలో రోగులు కాలినడకన వేరే ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. అయితే ఇజ్రాయిల్ సైన్యం మాత్రం ఈ ప్రకటనను ఖండించింది.
తాజావార్తలు
-
Hyderabadi Dalcha Recipe: అన్నంలోకి అదిరిపోయే సైడ్ డిష్.. ఇంట్లోనే అసలైన హైదరాబాదీ దాల్చా..
-
Coolpad Wide-Screen: రూ.13 వేలకే Coolpad వైడ్‌స్క్రీన్ ఫోన్? 16:10 డిస్ప్లే, Helio G99 చిప్సెట్తో రానుందా?
-
January 12 Vidudala: సైలెంట్‌గా ఊటీ చేరుకున్న అనిల్ రావిపూడి టీమ్..!
-
Nobel Prize Economics : అర్థశాస్త్ర నోబెల్‌పై ఆసక్తి.. విజేతలుగా ఇద్దరు ప్రముఖులు..
-
Srisailam Reservoir: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో శ్రీశైలం జలాశయం.. దేశంలోనే తొలి ప్రాజెక్టుగా గుర్తింపు
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!